PC: X
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించినప్పటికి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. గిల్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (16, 8) శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే అవుటై నిరాశపరిచాడు. ఈ క్రమంలో లెఫ్టార్మ్ స్పిన్ వీక్‌నెస్‌ను అధిగమించేందుకు గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
రెండో టెస్టు కోసం ఇప్పటికే కొలంబో చేరుకున్న భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. రాహుల్, కుల్దీప్ వంటి సీనియర్ క్రికెటర్లు విశ్రాంతి తీసుకున్నప్పటికి గిల్ మాత్రం నెట్స్‌లో చెమట్చోడ్చాడు.
కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌ను గిల్ సుదీర్ఘంగా ఎదుర్కొన్నాడు. గిల్ తాజా నెట్ సెషన్‌కు సంబంధించిన వివరాలను భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.
భారత స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఆ రోజు గిల్ నెట్ సెషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఆ కుడిచేతి వాటం బ్యాటర్ కొలంబో పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు.
"గిల్ బ్యాటింగ్ శైలి గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు స్వేచ్ఛగా పరుగులు సాధించే బ్యాటర్. పిచ్ స్వభావం, బౌన్స్ అంచనా వేస్తూ కొలంబో పరిస్థితులకు అలవాటు పడేందుకే కాస్త ఎక్కవ సమయం నెట్స్‌లో గడిపాడు.
ఇందులో ఎలాంటి ప్రత్యేకమైన ప్రణాళికలేమీ లేవు" అని బహుతులే పేర్కొన్నాడు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. కొలంబోలోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.


