నొప్పిని భ‌రిస్తూనే మూడో రౌండ్‌కు మాజీ చాంపియ‌న్‌ | Former Champions-Elena Rybakina-Coco Guaff Advances 3rd Round-US Open 2026 | Sakshi
Sakshi News home page

US Open: నొప్పిని భ‌రిస్తూనే మూడో రౌండ్‌కు మాజీ చాంపియ‌న్‌

Sep 4 2026 11:18 AM | Updated on Sep 4 2026 11:53 AM

Former Champions-Elena Rybakina-Coco Guaff Advances 3rd Round-US Open 2026

Photo Credit: Twitter

యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్, మాజీ చాంపియన్‌ ఎలీనా రిబాకినా మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రెండో రౌండ్‌లో క‌జ‌కిస్తాన్ బామ‌ రిబాకినా 6-2, 6-4తో స్పెయిన్‌కు చెందిన జెస్సికా బౌజ‌స్‌ను మ‌ట్టిక‌రిపించింది. ఎడ‌మ కాలి మ‌డ‌మ నొప్పిని భ‌రిస్తూనే రిబాకినా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసింది. 

జెస్సికా 5-3తో ఆధిక్యంలో ఉన్న స‌మ‌యంలో తొలిసారి ఆమె స‌ర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబాకినా ఆ త‌ర్వాత వ‌రుస పాయింట్లు సాధించింది. గంట వ్య‌వ‌ధిలోనే రెండు సెట్ల‌లో మ్యాచ్‌ను ముగించింది. మూడో రౌండ్‌లో రిబాకినా ఉక్రెయిన్‌కు చెందిన యులియా స్టార్‌డుబెత్సోవాతో త‌ల‌ప‌డ‌నుంది. 


Photo Credit: Twitter

2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ విజేత అయిన రిబాకినా మ‌రోసారి టైటిల్ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. 2022లో వింబుల్డ‌న్ చాంపియ‌న్ అయిన రిబాకినా బెలార‌స్ స్టార్ అరీనా స‌బ‌లెంక‌ను సెమీస్‌లో ఎదుర్కొనే అవ‌కాశ‌ముంది. మ‌రో మ్యాచ్‌లో నాలుగో సీడ్ కోకో గాఫ్ కూడా మూడో రౌండ్‌కు చేరుకుంది. 

రెండో రౌండ్‌లో గాఫ్ 6-4, 7-6(7-5)తో స్పెయిన్‌కు చెందిన పౌలా బ‌డోసాపై సునాయాస విజ‌యాన్ని అందుకుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో మిర్రా ఆండ్రీవా జ‌ర్మ‌నీకి చెందిన లిస్‌పై, జోవిక్ (అమెరికా) ఇంగ్లండ్‌కు చెందిన జోన్స్‌పై విజ‌యాలు సాధించి త‌ర్వాతి రౌండ్‌లో అడుగుపెట్టారు.

 

Read: భార‌త బౌల‌ర్ దెబ్బ‌కు స్టోక్స్ ఫ్యూజులు ఔట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement