source: X
యూఎస్ ఓపెన్ 2026 సింగిల్స్‌లో స్పెయిన్ స్టార్, ప్రపంచ నంబర్ 3 ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ ఘణంగా బోణీ కొట్టాడు. గాయం కారణంగా దాదాపు ఐదు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న అతడు.. తొలి రౌండ్‌లో రష్యాకు చెందిన రోమన్ సఫియులిన్‌పై వరుస సెట్లలో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
ఆర్థర్ యాష్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అల్కరాజ్ 6-4, 6-4, 6-4 తేడాతో సఫియులిన్‌ను ఓడించాడు. కుడి మణికట్టు గాయం కారణంగా ఏప్రిల్ తర్వాత సింగిల్స్ మ్యాచ్ ఆడని అల్కరాజ్‌కు ఇది అదిరిపోయే రీఎంట్రీ.
గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడా లేదా అనే సందేహాల మధ్య బరిలోకి దిగిన అల్కరాజ్, ఆరంభం నుంచే తన దూకుడైన ఆటతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. సఫియులిన్ కొన్ని దశల్లో పోటీ ఇచ్చినా, కీలక పాయింట్లలో అల్కరాజ్ ఆధిపత్యం కొనసాగించాడు.
గతేడాది యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన అల్కరాజ్ ఈసారి కూడా టైటిల్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగాడు. గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు టెన్నిస్‌కు దూరంగా ఉన్నప్పటికీ, తొలి మ్యాచ్‌లోనే తన ఫిట్‌నెస్, పోరాట పటిమను చాటుకున్నాడు. రెండో రౌండ్‌లో అల్కరాజ్ పోర్చుగల్‌కు చెందిన జామీ ఫరియాతో తలపడతాడు.
చదవండి: US Open 2026: సబలెంకా శుభారంభం


