అల్విదా లియోనల్‌ మెస్సీ | Intresting Story-Lionel Messi-Who-Announce Retirement-Debut-2007 | Sakshi
Sakshi News home page

అల్విదా లియోనల్‌ మెస్సీ

Aug 31 2026 9:32 PM | Updated on Aug 31 2026 9:32 PM

Intresting Story-Lionel Messi-Who-Announce Retirement-Debut-2007

Photo Credit: Twitter

మెస్సీ ఒక ఉత్పాతం, మౌన ముని. ఎన్ని అడ్డంకులు, వివాదాలు ఎదురైనా త‌న ఆట‌తోనే స‌మాధానం చెప్పాడు త‌ప్ప హ‌ద్దులు మీరిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. నిజానికి మెస్సీకి కోపం కూడా ఎక్కువే. కానీ దాని అవ‌స‌రం ఎంత‌మేర ఉంటుందో అంతే చూపిస్తుంటాడు. కాబ‌ట్టే ఇవాళ ప్ర‌పంచంలో ప్ర‌తీ మూల‌న అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. గ‌తంలో ఫుట్‌బాల్ పీలే, మార‌డోనా స‌హా ఎంద‌రో దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌ను అందించినప్ప‌టికీ ఈ త‌రంలో మాత్రం మెస్సీనే దిగ్గ‌జ ఆట‌గాడు. ఇంకా చెప్పాలంటే అత‌డో ఆరాధ్య దైవం.

అలాంటి ఈ త‌రంలో ఫుట్‌బాల్ తెలిసినోడిని నిద్ర‌లో నుంచి లేపి ఒక ఆట‌గాడి పేరు చెప్ప‌మంటే మొద‌ట వినిపించే పేరు లియోన‌ల్ మెస్సీ. రెండు ద‌శాబ్దాలుగా త‌న ఆట‌తో ఫుట్‌బాల్ అభిమానుల గుండెల్లో గుడి క‌ట్టేసుకున్న మెస్సీ చూడాల్సిన‌వన్నీ చూశాడు. ఎనిమిది సార్లు బాల‌న్ డీ ఓర్ అవార్డు, ఆరుసార్లు యూరోపియ‌న్ గోల్డెన్ షేస్‌, ఎనిమిది సార్లు ఫిఫా బెస్ట్ ప్లేయ‌ర్‌, అలాగే 2025లో ఆల్‌టైమ్ బెస్ట్ ప్లేయ‌ర్‌గాను నిలిచాడు. త‌న కెరీర్‌లో లోటుగా ఉన్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ను కూడా నాలుగేళ్ల కింద‌ట ఖ‌తార్‌లోనే  అందుకున్నాడు. చూడాల్సిన‌వ‌న్నీ చూశాడు. అల్విదా మెస్సీ.

లియోనల్ మెస్సీ పూర్తి పేరు లియోనల్ ఆండ్రస్ మెస్సీ. 24 జూన్ 1987లో అర్జెంటినాలో జన్మించాడు. తండ్రిపేరు జార్జ్ మెస్సీ, తల్లి మారియా. చిన్నప్పటినుంచే మెస్సీ క్రీడలపై ఆసక్తి చూపేవాడు. మెస్సీని ఫుట్బాల్ క్రీడాకారుడిగా తీర్చి దిద్దడంలో అతని అమ్మమ్మ కీలక పాత్ర పోషించింది. మెస్సీ శిక్షణకు, మ్యాచులకు ఆమె తోడుగా వెళ్లడంతో పాటు, డబ్బులు ఇస్తుండేది. 

మెస్సీకి పదకొండు సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె మరణించింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆ తర్వాత చాలా ప్రమాదకరమైన వ్యాధితో మెస్సీ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో చికిత్స దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాడు. కుటుంబమంతా శ్రమించి అతని వైద్యానికి డబ్బులు సమకూర్చేది. 

దాదాపు చావు అంచుల్లోకి వెళ్లిన మెస్సీకి.. బార్సీలోనాకు చెందిన కోచ్ సాయం చేశాడు. బదులుగా బార్సీలోనా జట్టుకు మెస్సీ ఆడాల్సి ఉంటుందని కండిషన్ పెట్టాడు. దీనికి మెస్సీతో పాటు కుటుంబం మొత్తం అంగీకరించింది. మెస్సీ కోలుకున్న తర్వాత కుటుంబం మొత్తం స్పెయిన్కు షిఫ్ట్ అయింది. 2003లో మెస్సీ తన మొదటి ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు.

2007లో అంతర్జాతీయ అరంగేట్రం
మెస్సీ ప్రదర్శనకు అవక్కాయిన సెలెక్టర్లు.. అంతర్జాతీ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం కల్పించారు. 17 ఆగస్టు 2007న మెస్సీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మెస్సీ ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు. ఒకదాని తర్వాత ఒకటి సాధించుకుంటూ వెళ్లాడు. రికార్డులు సృష్టించాడు. 2012లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గిన్సిస్ వరల్డ్ రికార్డులోనూ చోటు దక్కించుకుంటున్నాడు. 2022 ఫిఫా ప్రపంచ కప్, ఒలింపిక్ స్వర్ణం, అనేక క్లబ్, వ్యక్తిగత ట్రోఫీలు గెలుచుకున్నాడు. ఎనిమిదిసార్లు ప్ర‌తిష్టాత్మ‌క బాల‌న్ డీ ఓర్ అవార్డును గెలుచుకున్నాడు.

చదవండి: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌ బై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement