సచిన్‌ను వెంటాడిన ఫోబియా వైభవ్‌కు అంటుకుందా? | Vaibhav Sooryavanshi Suffers-Nervous-Nineties-Missing-Centuries-Like Sachin | Sakshi
Sakshi News home page

సచిన్‌ను వెంటాడిన ఫోబియా వైభవ్‌కు అంటుకుందా?

Aug 31 2026 7:36 PM | Updated on Aug 31 2026 8:04 PM

Vaibhav Sooryavanshi Suffers-Nervous-Nineties-Missing-Centuries-Like Sachin

Photo Credit: Twitter

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు (అన్ని ఫార్మాట్లు) సాధించిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే సచిన్‌కు నెర్వస్ నైంటీస్ ఫోబియా ఉండేది. ఈ కారణంగా సచిన్ చాలాసార్లు సెంచరీలు చేజార్చుకున్నాడు. ఒకవేళ సచిన్‌కు 90 ఫోబియా లేకపోయుంటే అతడి ఖాతాలో 150 సెంచరీలు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా చిన్న వయసులోనే క్రికెట్‌లో అడుగుపెట్టి సచిన్ రికార్డును బద్దలుకొట్టిన వైభవ్ సూర్యవంశీని కూడా 90 ఫోబియా చుట్టుముట్టేసింది. ఈ మధ్యకాలంలో వైభవ్ తొంభైల్లో చాలాసార్లు ఔటయ్యాడు.

ఇటీవలి కాలంలో ఐపీఎల్ నుంచి దేశవాళీ టోర్నీలు, అనధికారిక మ్యాచ్‌లు చూసుకుంటే వైభవ్ వరుసగా 93 (38 బంతుల్లో), 97 (29 బంతుల్లో), 96 (47 బంతుల్లో), తాజాగా దులీప్ ట్రోఫీలో 92 పరుగుల వద్ద సెంచరీలకు అతి సమీపంలోకి వచ్చి అవుట్ అయ్యాడు. ఇలా ఇప్పటికే నాలుగు సెంచరీలను చేజార్చుకున్నాడు.

ఏమిటీ నెర్వస్ నైంటీస్‌?
90 ఫోబియాను క్రికెట్ పరిభాషలో "నెర్వస్ నైంటీస్" (Nervous Nineties) అని పిలుస్తారు. ఒక బ్యాటర్ సెంచరీ (100 పరుగులు) మైలురాయికి చేరుకునే ముందు, 90 నుండి 99 పరుగుల మధ్య ఒత్తిడికి గురై అవుట్ అవ్వడాన్ని ఇది సూచిస్తుంది. సాధారణంగా బ్యాటర్లు 90ల్లోకి రాగానే సెంచరీ కోసం కాస్త నెమ్మదిగా ఆడతారు. ఈ తరుణంలో అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్‌ను ఇచ్చేసుకుంటారు. సచిన్ తన కెరీర్‌లో చాలాసార్లు ఈ నెర్వస్ నైంటీస్‌ను ఎదుర్కొన్నాడు. తాజాగా  వైభవ్‌ను కూడా నెర్వస్ నైంటీస్ ఫోబియా చుట్టుముట్టినట్లుగా అనిపిస్తోంది.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి సెంట్ర‌ల్ జోన్ త‌మ రెండో ఇన్నింగ్స్‌లో 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 43 ప‌రుగులు చేసింది. ర‌జ‌త్ ప‌టీదార్ (5), ఆర్య‌న్ పాండే (4) క్రీజులో కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ జోన్ 43 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. అంత‌క‌ముందు ఈస్ట్‌జోన్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 266 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, తొలి ఇన్నింగ్స్‌లో సెంట్ర‌ల్ జోన్ కూడా 266 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

Read: దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement