Photo Credit: Twitter
టీమిండియా సీనియర్ ఆటగాడు, కేఎల్ రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ మయాంక్ అగర్వాల్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నాడు. ఈ మేరకు 35 ఏళ్ల మయాంక్ డుర్హమ్ క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగానే కౌంటీ చాంపియన్‌షిప్ 2026లో డుర్హమ్ తరఫున చివరి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు.
అయితే ఏడాది కింద ఇదే మయాంక్ అగర్వాల్ ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో డేవిడ్ బెడింగ్‌హమ్ స్వదేశానికి వెళ్లిపోవడంతో అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ ఆడనున్నట్లు డుర్హమ్ క్రికెట్ క్లబ్ తెలిపింది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన మయాంక్‌కు డుర్హమ్ క్లబ్ ఘనస్వాగతం పలికింది.
ఇక కౌంటీ క్రికెట్‌లో మయాంక్ అగర్వాల్‌కు మంచి రికార్డే ఉంది. గతేడాది యార్క్‌షైర్ తరఫున ఆడిన మయాంక్ మూడు మ్యాచ్‌ల్లో 50 సగటుతో 201 పరుగులు సాధించాడు. లీడ్స్ వేదికగా జరిగిన సీజన్ 70వ మ్యాచ్‌లో అగర్వాల్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 175 పరుగులు చేయడం విశేషం. యాదృశ్చికంగా అప్పుడు యార్క్‌షైర్ తరఫున ఇదే డుర్హమ్ క్లబ్‌పై సెంచరీ సాధించిన మయాంక్‌కు కౌంటీ క్రికెట్‌లో ఇదే మెయిడెన్ శతకం కావడం విశేషం. ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో మయాంక్‌కు అది 19వ సెంచరీ.
ఈ ఏడాది డుర్హమ్ క్లబ్ తరఫున ఆడనున్న మయాంక్ 2026 సీజన్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నాడు. తొలుత డుర్హమ్ క్లబ్ సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు నార్తాంప్టన్ వేదికగా నార్తాంప్టన్‌షైర్‌తో ఆడనుంది. ఆ తర్వాత చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా సెప్టెంబర్ 8 నుంచి 11 వరకు మిడిలెసెక్స్‌తో, సెప్టెంబర్ 15 నుంచి వోర్సెష్టర్‌షైర్‌తో, చివరగా లంకాషైర్‌తో మ్యాచ్‌లు ఆడనుంది.
ఇక 2022లో భారత్ తరఫున చివరి టెస్టు మ్యాచ్ ఆడిన మయాంక్ అగర్వాల్ ఓవరాల్‌గా టీమిండియాకు 21 టెస్టులాడి 1,488 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి.
Read: దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో అరుదైన ఫీట్


