source: X
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. మేజర్ లీగ్ సాకర్-2026లో భాగంగా మాంట్రియల్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా 4 గోల్స్ చేశాడు. ఫలితంగా అతడి జట్టు ఇంటర్ మయామీ 7-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ తొలి గోల్ బ్రెజిల్ స్టార్ కేస్మిరో చేశాడు. ఈ సీజన్‌లోనే ఇంటర్ మయామిలో చేరిన కేస్మిరోకు క్లబ్ తరఫున ఇదే తొలి గోల్. అనంతరం మాంట్రియల్ 37వ నిమిషంలో గోల్ చేసి 1-1తో స్కోరును సమం చేసింది.
🚨 MESSI HAS SCORED 4 GOALS IN A SINGLE MATCH.
- The Greatest of all time in Sporting history 🐐 pic.twitter.com/VrCqRYBtPN— Johns. (@CricCrazyJohns) August 30, 2026
ఆ తర్వాతే మెస్సీ షో మొదలైంది. అతని ఫ్రీ-కిక్ డిఫెండర్‌కు తగిలి నెట్‌లోకి వెళ్లడంతో మయామి 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. 52వ నిమిషంలో మెస్సీ మరో అద్భుతమైన గోల్ చేశాడు. పలువురు డిఫెండర్లను తప్పించుకుని, తన బలహీనమైన కాలితో బంతిని నెట్‌లోకి పంపాడు.
80వ నిమిషంలో తన చిరకాల మిత్రుడు లూయిస్ సురెజ్‌కు మెస్సీ అద్భుతమైన అసిస్ట్ అందించాడు. మరో మూడు నిమిషాలకే గోల్‌కీపర్‌పై చిప్ షాట్‌తో మెస్సీ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. దీంతో మయామి గోల్స్ సంఖ్య 5కు చేరింది.
కొద్ది సేపటికి యువ ఆటగాడు అలెగ్జాండర్ షా అద్భుతమైన గోల్‌తో మమామి గోల్స్ సంఖ్యను 6కు పెంచాడు. మ్యాచ్ కాసేపట్లో ముగుస్తుందనగా మెస్సీ మరో ఫ్రీ-కిక్ గోల్‌తో తన ఖాతాలో నాలుగో గోల్‌ను నమోదు చేశాడు. చివరకు ఇంటర్ మయామి 7-1 గోల్స్ తేడాతో మాంట్రియల్‌పై భారీ విజయం సాధించింది.


