బ్రెజిల్‌కు ముందు మరో ప్రపంచకప్ జట్టుతో భారత్‌ మ్యాచ్‌ | India To Face 2026 FIFA World Cup Side Panama Before High Profile Brazil Friendly, Check Out Schedule Details Inside | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌కు ముందు మరో ప్రపంచకప్ జట్టుతో భారత్‌ మ్యాచ్‌

Aug 26 2026 8:17 AM | Updated on Aug 26 2026 10:03 AM

Ahead Of Brazil Friendly, India To Play Another FIFA World Cup 2026 Team

source: X

బ్రెజిల్‌తో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ముందు భారత ఫుట్‌బాల్ జట్టు మరో ప్రపంచకప్‌ జట్టుతో తలపడనుంది. 2026 ఫిఫా ప్రపంచకప్‌ ఆడిన పనామాతో భారత్ సెప్టెంబర్ 26న అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. 

ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) మంగళవారం వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు వేదికను ఇంకా ప్రకటించలేదు. భారత్, పనామా జట్లు తలపడటం ఇదే తొలిసారి.

ఫిఫా ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న పనామా, 2026 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, క్రొయేషియా, ఘనా ఉన్న గ్రూప్‌లో ఆడి చివరి స్థానంలో నిలిచింది.

పనామాతో మ్యాచ్ అనంతరం భారత్ మరో భారీ సవాల్‌కు సిద్ధం కానుంది. అక్టోబర్ 3న బ్రెజిల్‌తో తలపడనుంది. ఇది భారత జట్టుకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలవనుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రశ్రేణి జట్టైన బ్రెజిల్‌తో తలపడే ముందు పనామాతో మ్యాచ్ ఆడటం భారత ఆటగాళ్లకు మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది.

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం 2026 ప్రపంచకప్‌లో ఆడిన జట్లతో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది.

సెప్టెంబర్ 26: పనామా × భారత్‌
అక్టోబర్ 3: బ్రెజిల్ × భారత్
నవంబర్ 12: న్యూజిలాండ్ × భారత్
నవంబర్ 15: న్యూజిలాండ్ × భారత్
- న్యూజిలాండ్‌ మ్యాచ్‌లు ఇదివరకే ఖరారయ్యాయి.  

చదవండి: ఈస్ట్‌ బెంగాల్‌ మహిళల ఎఫ్‌సీ ముందంజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement