కౌలాలంపూర్: ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్‌సీ) మహిళల చాంపియన్స్ లీగ్ గ్రూప్ దశకు భారత్‌కు చెందిన ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు అర్హత సాధించింది. ప్రిలిమినరీ రౌండ్ గ్రూప్ ‘ఎ’ చివరి మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ జట్టు 2–0తో సభా ఎఫ్‌సీ (మలేసియా) జట్టును ఓడించింది.
ఈస్ట్ బెంగాల్ జట్టుకు ఒలీవియా అనోకి (67వ నిమిషంలో), తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ (87వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. గ్రూప్ ‘ఎ’లో ఈస్ట్ బెంగాల్ ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ గెలిచి 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చాంపియన్స్ లీగ్ గ్రూప్ దశ మ్యాచ్‌లు మూడు వేదికల్లో నవంబర్ 1 నుంచి 7 వరకు జరుగుతాయి. సెపె్టంబర్ 3వ తేదీన ‘డ్రా’ విడుదల చేస్తారు.


