PC: X
బెంగళూరు వేదికగా వెస్ట్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నార్త్ జోన్ ఫాస్ట్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ అన్షుల్ కాంబోజ్ బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్‌జోన్ 165 పరుగులే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కాంబోజ్ ప్రత్యర్ది బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
వన్డే ఫార్మాట్‌ను తలపిస్తూ కేవలం 52 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. తొమ్మిది బ్యాటింగ్‌కు వచ్చిన కాంబోజ్ ఈ తరహా విధ్వంసం సృష్టిస్తాడని వెస్ట్ జోన్ బౌలర్లు అస్సలు ఊహించి ఉండరు. తుషార్ దేశ్‌పాండే, తనుష్ కొటియాన్ వంటి స్టార్ బౌలర్లను సైతం అన్షుల్ వదల్లేదు.
ఫలితంగా నార్త్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటైంది. నార్త్‌జోన్ బ్యాటర్లలో కాంబోజ్‌తో పాటు అయూశ్ బదోని(51),ఆయుష్ దోసేజా(42) రాణించారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. వెస్ట్ జోన్ బౌలర్లలో తనీష్ కోటియన్, దేశ్‌పాండే తలా నాలుగు వికెట్లు సాధించారు. ఇక బ్యాటింగ్‌లో సత్తాచాటిన అన్షుల్.. బౌలింగ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. మొదటి రోజు ఆటలో అతడికి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.
చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్.. విధ్వంకర వీరుడి బ్యాటింగ్‌కు లైన్ క్లియర్
4⃣,6⃣,6⃣,6⃣,6⃣
Anshul Kamboj went berserk in the 66th and 67th over to add crucial runs down the order for North Zone, scoring 60 off 52 balls 🙌
Scorecard ▶️ https://t.co/cATggoXuky#DuleepTrophy pic.twitter.com/u8r8JMbvwA— BCCI Domestic (@BCCIdomestic) August 23, 2026


