టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. విధ్వంకర వీరుడి బ్యాటింగ్‌కు లైన్‌ క్లియర్‌ | Team India Batting Coach Gives Big Update On Injured Rishabh Pant Ahead Of Day 2 vs Sri Lanka, Check Full Story Inside | Sakshi
Sakshi News home page

టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. విధ్వంకర వీరుడి బ్యాటింగ్‌కు లైన్‌ క్లియర్‌

Aug 23 2026 6:51 PM | Updated on Aug 23 2026 7:02 PM

Team India batting coach gives big update on injured Rishabh Pant

PC: X

కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట‌లో టీమిండియా పూర్తి ఆధిప‌త్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త జ‌ట్టు 5 వికెట్ల న‌ష్టానికి 300 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(117) అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. ఇది అతడికి వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. అతడితో పాటు శుబ్‌మన్‌ గిల్‌(50), రవీంద్ర జడేజా(43), యశస్వి జైశ్వాల్‌(45) రాణించారు.

టీమిండియాకు గుడ్‌ న్యూస్‌
అయితే రెండో రోజు ఆటకు ముందు టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ అందింది. తొలి రోజు ఆటలో గాయపడ్డ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ తిరిగి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. ఈ విషయాన్ని భారత బ్యాటింగ్‌ సితాన్షు కోటక్ ధ్రువీకరించాడు. పంత్‌ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. రెండో రోజు అతడు బ్యాటింగ్‌కు రానున్నాడు అని కోటక్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.

పంత్‌కు ఏమైందంటే?
భారత ఇన్నింగ్స్‌ 57వ ఓవర్‌లో లంక పేసర్‌ లహిరు కుమార పంత్‌కు ఓ షార్ట్‌పిచ్‌ డెలివరీని సంధించాడు. ఆ బంతిని అతడు ఫుల్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్‌కు మిస్స్‌ అయ్యి ఎడమ చేతి గ్లౌవ్‌పై తాకింది.

దీంతో అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. వెంటనే ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. దీంతో 3 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ పంత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానాన్ని వీడాల్సి వచ్చింది. కానీ అతడి గాయం తీవ్రమైనది కాకపోవడంతో టీమ్ మేనెజ్‌మెంట్ ఊపిరిపీల్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement