ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ సత్తాచాటింది. తాజాగా ర్యాంకింగ్స్‌లో బంగ్లా జట్టు ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్‌కు చేరుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్ కావడం విశేషం. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనకు గాను ఈ రివార్డ్ లభించింది.
23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై తాము ఆడిన చారిత్రత్మక టెస్టు సిరీస్‌లో బంగ్లా జట్టు అదరగొట్టింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టును 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అనంతరం రెండో టెస్టులో ఓడిపోయినప్పటికి.. 78 రేటింగ్ పాయింట్లతో బంగ్లా టైగర్స్ తమ ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నారు.
ఈ క్రమంలో బంగ్లాదేశ్ వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక వంటి బలమైన జట్లను వెనక్కి నెట్టింది. ఈ ఘనతపై బంగ్లాదేశ్ టెస్ట్ కెప్టెన్ నజ్ముల్ హోస్సేన్ శాంటో ఆనందం వ్యక్తం చేశాడు. ఇక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా తొలి రెండు స్ధానాల్లో ఉన్నాయి. అదేవిధంగా భారత్ నాలుగో స్ధానంలో కొనసాగుతుంటే పాకిస్తాన్ ఏకంగా 8వ స్ధానానికి పడిపోయింది.
చదవండి: SL Vs IND: దేవ్‌దత్త్ పడిక్కల్ సెంచరీ


