SL Vs IND: దేవ్‌దత్త్‌ పడి​క్కల్‌ సెంచరీ | IND Vs SL: Devdutt Padikkal Hits Back-to-Back Test Centuries In Sri Lanka, Continues Stunning Run Of Form | Sakshi
Sakshi News home page

SL Vs IND: దేవ్‌దత్త్‌ పడి​క్కల్‌ సెంచరీ

Aug 23 2026 4:27 PM | Updated on Aug 23 2026 6:28 PM

India vs Sri Lanka : Devdutt Padikkal Slams Ton

PC: X

టీమిండియా యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ శ్రీలంక గడ్డపై ఇరగదీస్తున్నాడు. గాలే టెస్టులో భారీ శతకంతో కదం తొక్కిన పడిక్కల్‌.. ఇప్పుడు కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ అద్భుత సెంచరీతో మెరిశాడు. 

ఈ కర్ణాటక బ్యాటర్ 168 బంతుల్లో తన రెండో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అవుట్‌ కావడంతో పడిక్కల్‌ త్వరగా క్రీజులోకి వచ్చాడు.

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అవుట్‌ కావడంతో పడిక్కల్‌ త్వరగా క్రీజులోకి వచ్చాడు. యశస్వి జైశ్వాల్‌తో కలిసి పడిక్కల్‌ స్కోర్‌ బోర్డును ముందుకు నడిపించాడు.జైశ్వాల్‌ అవుటైన తర్వాత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌తో కూడా కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

ఓవరాల్‌గా 193 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్‌.. 12 ఫోర్లతో 117 పరుగులు చేశాడు. కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతంగా రాణిస్తున్న పడిక్కల్‌పై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 82 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(43), జురెల్‌(6) ఉన్నారు.
చదవండి: IND vs SL: టీమిండియాకు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement