టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌! | IND Vs SL 2nd Test, India Predicted XI, SSC Pitch Report, Colombo Weather Forecast, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

IND vs SL: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌!

Aug 22 2026 7:56 PM | Updated on Aug 22 2026 8:17 PM

IND vs SL 2nd Test: India predicted XI, SSC pitch report, Colombo weather forecast

PC: X

కొలంబో వేదికగా శ్రీలంకతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి 2-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని గిల్ సేన పట్టుదలతో ఉంది. మరోవైపు తొలి టెస్టులో ఓటమి పాలైన ఆతిథ్య శ్రీలంక.. కొలంబోలో గెలిచి సిరీస్ సమం చేయాలని వ్యూహాలు రచిస్తోంది.

అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. అ‍క్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం.. తొలి రోజు కొలంబోలో వర్షం కురిసేందుకు 60 శాతం అస్కారముంది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు తేలికపాటి జల్లులు కురవనున్నట్లు పలు వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా తొలి టెస్టు జరిగిన గాలేలో కూడా ఆటకు వర్షం ఆటంకం కలిగించింది.

పిచ్ రిపోర్ట్‌(అంచనా)
ఇక కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ పిచ్ మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు బాగా అనుకూలించే ఛాన్స్ ఉంది. మ్యాచ్ గడుస్తున్న కొద్దీ పిచ్ క్రమంగా పొడిగా మారి, మూడో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుంది.

దీంతో నాలుగో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లను ఎదుర్కోవడం కాస్త కష్టమవుతోంది. అయితే కొలంబోలో వాతావరణ పరిస్థితుల కారణంగా ఫస్ట్ సెషన్‌లో కొత్త బంతితో పేసర్లు కొంతవరకు పట్టు సాధించవచ్చు.

కాగా చారిత్రాత్మక సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో టీమిండియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఈ వేదికలో తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్‌.. మూడింట విజయం, రెండింట ఓటమి పాలైంది. మరో నాలుగు మ్యాచ్‌లను డ్రాగా ముగించింది.

తుది జ‌ట్లు(అంచ‌నా)
భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మానవ్ సుతార్, సరాంశ్ జైన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

శ్రీలంక: లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూరియబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా, సోనాల్ దినుషా, కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, అసిత ఫెర్నాండో, లహిరు కుమార.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement