కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మణికట్టు గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పంత్ శ్రీలంక పేసర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడ్డాడు.
ఈ క్రమంలో లంక ఫాస్ట్ బౌలర్ లహిరు కుమార వేసిన ఓ బంతిని పంత్ ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ మిస్స్ అయ్యి అతడి ఎడమ చేతికి తాకింది. ఫలితంగా రిషబ్ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి పంత్ నొప్పి తగ్గలేదు. దీంతో 3 పరుగులు చేసిన పంత్ ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు.
అతడి స్దానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. అయితే పంత్ గాయం తీవత్రపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా భారత బ్యాటర్లు సత్తాచాటుతున్నారు. 65 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(85), రవీంద్ర జడేజా(17) ఉన్నారు. అంతకుముందు గిల్(50) కూడా హాఫ్ సెంచరీ చేశాడు.
చదవండి: Mitchell Starc: 771 వికెట్లు.. దెబ్బకు అశ్విన్, చమిందా వాస్ రికార్డ్‌లు బ్రేక్


