కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్‌ కిషన్‌ | ishan Kishan goes past Virat Kohli to set a new Indian record for most T20 runs in a calendar year | Sakshi
Sakshi News home page

కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్‌ కిషన్‌

Oct 7 2026 7:00 PM | Updated on Oct 7 2026 7:12 PM

ishan Kishan goes past Virat Kohli to set a new Indian record for most T20 runs in a calendar year

source: X

టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేరిట ఉండిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. నిన్నటి వరకు ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగలు చేసిన భారత బ్యాటర్‌గా చలామణి అయిన కోహ్లిని ఇషాన్‌ అధిగమించాడు.

నిన్న విండీస్‌తో జరిగిన తొలి టీ20లో 37 పరుగులతో అజేయంగా నిలిచిన ఇషాన్‌ ఈ ఘనత సాధించాడు. కోహ్లి 2016లో 1614 టీ20 పరుగులు చేయగా.. ఇషాన్‌ ఈ ఏడాది ఇప్పటికే 1644 పరుగులు సాధించాడు. ఇషాన్‌ ఈ ఏడాది మరిన్ని టీ20లు ఆడే అవకాశం ఉంది కాబట్టి అతడి పరుగుల సంఖ్య మరింత పెరగవచ్చు.

ఈ ఏడాది ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 45 టీ20 మ్యాచ్‌ల్లో 39.14 సగటున, సెంచరీ, 13 అర్ద సెంచరీల సాయంతో 1644 పరుగులు చేశాడు. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల టాప్‌-5 జాబితాలో ఇషాన్‌, కోహ్లి తర్వాతి స్థానాల్లో అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ ఉన్నారు.

అభషేక్‌ గతేడాది (2025) టీ20ల్లో 1602 పరుగులు సాధించాడు. అతడు ఈ ఏడాది కూడా అదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఇప్పటివరకు 1395 పరుగులు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 2022లో 1503 పరుగులు చేశాడు. స్కై 2023లో 1338 పరుగులు సాధించాడు.

ఇదిలా ఉంటే, తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసి వెస్టిండీస్‌ను 171 పరుగులకే పరిమితం చేసిన భారత జట్టు.. ఆతర్వాత 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మెరుపు శతకంతో విరుచుకుపడి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. 

ఇదీ చదవండి: జట్టు ప్రకటన.. శాంసన్‌ సోదరులకు దక్కని చోటు!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement