దంచికొట్టిన వార్నర్‌.. బంగ్లాదేశ్‌పై ఆసీస్‌ ఘన విజయం | World Championship of Legends 2026: Australia beat Bangladesh | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వార్నర్‌.. బంగ్లాదేశ్‌పై ఆసీస్‌ ఘన విజయం

Oct 7 2026 8:13 PM | Updated on Oct 7 2026 8:17 PM

World Championship of Legends 2026: Australia beat Bangladesh

source: X

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2026 టోర్నీలో ఇవాళ ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌, బంగ్లాదేశ్‌ ఛాంపియన్స్‌ జట్లు తలపడ్డాయి. షార్జా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బంగ్లాదేశ్‌పై 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో 66; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), కల్లమ్‌ ఫెర్గూసన్‌ (36 బంతుల్లో 63; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలతో సత్తా చాటారు. 

వికెట్‌ కీపర్‌ బెన్‌ డంక్‌ (45 నాటౌట్‌) కూడా బ్యాట్‌ ఝులిపించాడు. బంగ్లా బౌలర్లలో అబు జయేద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. జియావుర్‌ రహ్మాన్‌ 2, రుబెల్‌ హొసేన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. కెప్టెన్‌ మహ్మదుల్లా (73 నాటౌట్‌) ఒంటరిపోరాటం చేసినా తన జట్టును గెలిపించలేకపోయాడు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్‌ బౌలర్లలో ఫవాద్‌ అహ్మద్‌ 2, బెన్‌ హిల్ఫెన్హాస్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, డి ఆర్కీ షార్ట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.  

ఇదీ చదవండి: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్‌ కిషన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement