న్యూజిలాండ్ టూర్‌.. టీమిండియాకు భారీ షాక్‌! | Rishabh Pant suffers back injury in fresh setback | Sakshi
Sakshi News home page

IND vs NZ: న్యూజిలాండ్ టూర్‌.. టీమిండియాకు భారీ షాక్‌!

Oct 7 2026 5:22 PM | Updated on Oct 7 2026 5:25 PM

Rishabh Pant suffers back injury in fresh setback

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వెన్ను గాయం బారిన పడ్డాడు.  జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన ఇరానీ కప్ 2026లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించిన పంత్‌.. వెన్ను నొప్పి కార‌ణంగా చివ‌రి రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌లేదు.  దీంతో  రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు బాధ్యతలను వైస్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ చేపట్టగా.. ఆర్యన్ జుయల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించాడు.

కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు స‌న్నాహ‌కాల్లో భాగంగా ఇండియా-ఎ జట్టు త‌ర‌పున ఆడాల‌ని పంత్ నిర్ణ‌యించుకున్నాడు. కానీ అంత‌లోనే రిష‌బ్‌ వెన్ను గాయం బారిన ప‌డ‌డం టీమ్ మేనెజ్‌మెంట్‌ను తీవ్ర ఆందోళ‌న కలిగిస్తోంది.

కివీస్‌-ఎతో సిరీస్‌కు అత‌డిని ఇండియా-ఎ జ‌ట్టుకు ఎంపిక చేసిన‌ప్ప‌టికి త‌న ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. అత‌డు ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అత‌డు పూర్తి ఫిట్‌నెస్ సాధించి న్యూజిలాండ్‌తో సిరీస్ స‌మ‌యానికి అందుబాటులో ఉండాల‌ని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌కు చేరాలంటే కివీస్ టెస్ట్ సిరీస్ భార‌త్‌కు చాలా కీల‌కం. ఈ సిరీస్‌ నవంబర్‌ 19 నుంచి ప్రారంభం కానుంది.

ఇండియా ‘ఎ’ జట్టు వివరాలు: ధ్రువ్ జురెల్ (కెప్టెన్ / వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ స్మరణ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్ - ఫిట్‌నెస్‌కు లోబడి), వాషింగ్టన్ సుందర్, ఆకిబ్ నబీ, ఆకాశ్ దీప్, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్, ముకేశ్ చౌదరి, సాయి సుదర్శన్, యశ్ రాథోడ్, ముకేశ్ కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement