771 వికెట్లు.. దెబ్బకు అశ్విన్‌, చమిందా వాస్‌ రికార్డ్‌లు బ్రేక్‌ | Mitchell Starc enters all-time highest wicket-takers list, surpassing R Ashwin and Chaminda Vaas | Sakshi
Sakshi News home page

Mitchell Starc: 771 వికెట్లు.. దెబ్బకు అశ్విన్‌, చమిందా వాస్‌ రికార్డ్‌లు బ్రేక్‌

Aug 23 2026 3:29 PM | Updated on Aug 23 2026 3:29 PM

Mitchell Starc enters all-time highest wicket-takers list, surpassing R Ashwin and Chaminda Vaas

PC: X

ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో ప‌ద‌కొండో స్దానానికి స్టార్క్ ఎగ‌బాకాడు. ఈ క్ర‌మంలో శ్రీలంక దిగ్గజం చమిండ వాస్ (761 వికెట్లు), భార‌త స్పిన్న‌ర్ రవిచంద్రన్ అశ్విన్ (765 వికెట్లు)లను స్టార్క్ అధిగ‌మించాడు. 

మెకే వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో స్టార్క్ ఈ ఫీట్ సాధించాడు. మిచెల్ త‌న అంత‌ర్జాతీయ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు ఫార్మాట్లలో క‌లిపి 25.07 సగటుతో 771 వికెట్లు సాధించాడు. ఈ జాబితాలో శ్రీలంక లెజెండ‌రీ స్పిన్న‌ర్ ముత్తయ్య మురళీధర‌న్‌(1347) అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. టెస్టుల్లో కూడా స్టార్క్‌(445) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్‌ను దాటి టాప్-10లోకి ప్రవేశించాడు.

నిప్పులు చెరిగిన స్టార్క్‌
కాగా డార్విన్ టెస్టులో ఓట‌మికి ఆసీస్ ప్ర‌తీకారం తీర్చుకుంది. రెండో టెస్టులో బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్ 51 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని స్టార్క్ శాసించాడు.

అతడి దెబ్బకు బంగ్లాదేశ్ కేవలం 64 పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కూడా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు పాట్ కమిన్స్‌, లియోన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా బంగ్లా దేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: తుస్సుమనిపించిన ఇషాన్‌ కిషన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement