విరాట్ కోహ్లి మాజీ సహచరుడు (ఆర్సీబీ) స్వస్తిక్ చికారా పాకిస్తాన్ ఆటగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను అనుకరించి వార్తల్లోకెక్కాడు. యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫర్హాన్ తరహాలో గన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
2025 ఆసియా కప్‌లో ఫర్హాన్ భారత్‌పై అర్ధశతకం సాధించిన తర్వాత ఈ తరహా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అప్పట్లో ఈ అంశం తీవ్ర వివాదానికి దారితీసింది
Indian Shahibzada Farhan 😭🔥
Swastik Chikara played a match-winning knock of 97* off just 46 balls in the UPT20.
After finishing the match, he did the 𝗴𝘂𝗻 𝗰𝗲𝗹𝗲𝗯𝗿𝗮𝘁𝗶𝗼𝗻. 🔥 pic.twitter.com/ICkty9rYkg— Jara (@JARA_Memer) August 23, 2026
తాజాగా చికారా ఫర్హాన్ గన్ సెలబ్రేషన్స్ రిపీట్ చేయడం చర్చనీయాంశమైంది. చికారా చర్యపై కొందరు అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ మ్యాచ్‌లో చికారా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. కేవలం 46 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. విజయానికి అవసరమైన పరుగులను సిక్సర్‌తో పూర్తి చేసిన అనంతరం చికారా ప్రేక్షకుల వైపు చూస్తూ తుపాకీ కాల్చినట్లుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
కాగా, చికారా, ఫర్హాన్‌కు ముందు కూడా ఇలాంటి గన్ సెలబ్రేషన్స్ ఓ సారి తారసపడ్డాయి. 2005లో శ్రీలంకపై 183 పరుగులు చేసిన అనంతరం టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోని కూడా బ్యాట్‌ను తపాకీలా పట్టుకొని గన్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
భీకర ఫామ్‌లో చికారా
చికారా ప్రస్తుతం యూపీ టీ20 లీగ్ 2026లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 48.25 సగటుతో 193 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ ఆకట్టుకుంటున్నాడు.
అయితే అతడి ప్రధాన సమస్య నిలకడ. ఐదు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు 50కి పైగా స్కోర్లు చేసినప్పటికీ, మరో మూడు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. 2025 యూపీ టీ20 సీజన్‌లోనూ చికారా 13 ఇన్నింగ్స్‌ల్లో 370 పరుగులు చేసి మూడు అర్ధశతకాలు సాధించాడు.
ఐపీఎల్ పునరాగమనమే లక్ష్యం
2025లో ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో చికారా సభ్యుడిగా ఉన్నప్పటికీ, ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అనంతరం ఆర్సీబీ అతడిని విడుదల చేసింది.
2026 మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ చికారాపై ఆసక్తి చూపలేదు. యూపీ టీ20 లీగ్ ప్రదర్శనలు అతడి ఐపీఎల్ అవకాశాలను పెంచవచ్చు.
2027 ఐపీఎల్‌కు ఓపెనర్ల కోసం చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి జట్లు చికారాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.


