పాకిస్తాన్‌ విజయం | Pakistan won the first T20I against Sri Lanka by 4 wickets | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ విజయం

Oct 10 2026 4:15 AM | Updated on Oct 10 2026 4:15 AM

Pakistan won the first T20I against Sri Lanka by 4 wickets

రావల్పిండి: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన పాకిస్తాన్‌ జట్టు శ్రీలంకతో తొలి టి20లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. లహిరు ఉడార (91; 11 ఫోర్లు, 1 సిక్స్‌) దంచి కొట్టాడు.  అనంతరం ఛేదనలో పాకిస్తాన్‌ 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, కెప్టెన్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (53 బంతుల్లో 89; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాజ్‌ సదఖత్‌ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement