breaking news
Swastik Chikara
-
మహిళల పట్ల అసభ్య ప్రవర్తన.. వివాదాల్లో చిక్కుకున్న అంతర్జాతీయ క్రికెటర్లు వీరే..!
క్రీడల్లో ఆన్ ఫీల్డ్ ప్రదర్శన ఎంత ముఖ్యమో, ఆఫ్ ద ఫీల్డ్ ప్రవర్తన కూడా అంతే కీలకం. రెండిటిలో ఏది సరిగ్గా లేకపోయినా, ఆటగాళ్ల కెరీర్లు అర్దంతరంగా ముగిసిపోతాయి. తాజాగా ఓ భారత యువ క్రికెటర్ పెద్దగా పరిచయం లేని యువతితో సోషల్‌మీడియాలో అసభ్యకరమైన సంభాషణ చేసి వార్తల్లోకెక్కాడంతో ఈ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి మూల్యం చెల్లించుకున్న అంతర్జాతీయ క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం.ఈ జాబితాతో ముందుగా వచ్చేది టీమిండియా ఆటగాడు పృథ్వీ షా. అద్భుతమైన టాలెంట్ కలిగి, క్రమశిక్షణ లేకపోవడం వల్ల కెరీర్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఈ మహారాష్ట్ర ఆటగాడు.. 2023లో ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో పబ్లిక్‌లో ఘర్షణకు దిగి అప్పటికే పతనమైన కెరీర్‌ను అదఃపాతాళానికి పడేసుకున్నాడు. ఈ ఎడిసోడ్ కారణంగా షా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోనప్పటికీ.. కెరీర్లో నిలదొక్కుకునే అవకాశాలు కోల్పోయాడు.ఈ జాబితాలో రెండో పేరు లూక్ పోమర్స్‌బాచ్. ఆ మాజీ ఆసీస్ ఆటగాడు 2013 ఐపీఎల్ సందర్భంగా ఢిల్లీలో ఓ మహిళపై దాడి చేసి కటకటాలపాలయ్యాడు. ఆ తర్వాత ఆ కేసు సెటిల్మెంట్కు వచ్చినప్పటికీ.. పోమర్స్‌బాచ్ కెరీర్ పెద్దగా ముందుకు సాలేదు.రుబెల్ హొసైన్ఈ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ 2015లో నటి నజ్నిన్ ఆక్టర్ హ్యాపీపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నిలబడనప్పటికీ.. రుబెల్ కెరీర్లో ఇది మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ ఉదంతం తర్వాత అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు.మొహమ్మద్ షహ్జాద్ ఈ ఆఫ్ఘనిస్తాన్ విధ్వంసకర బ్యాటర్ 2018లో ఓ మహిళను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతం తర్వాత షహ్జాద్ క్రికెట్ సర్కిల్స్ నుంచి కనుమరుగయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు విచారణలో షహ్జాద్ తప్పుచేసినట్లు తేలిందని ప్రచారం జరిగింది.దనుష్క గుణతిలక శ్రీలంకకు చెందిన ఈ మాజీ ఆటగాడు 2018లో ఇంగ్లండ్‌లో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ఇతగాడు 2022లో ఆస్ట్రేలియాలో కూడా ఓ మహిళపై లైంగిక దాడి చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ కేసులో గుణతిలక అరెస్టు కూడా అయ్యాడు. ఈ రెండు ఉదంతాల కారణంగా అతని కెరీర్ పట్టాలెక్కకుండానే గాడి తప్పింది. గుణతిలక చెడుకు శ్రీలంక క్రికట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాడు.అంతర్జాతీయ క్రికెటర్లు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతాలు ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. తాజాగా ఆర్సీబీ మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా ఓ మహిళతో సోషల్‌మీడియా వేదికగా అసభ్యంగా సంభాషిస్తూ వార్తల్లోకెక్కాడు. తనతో చికారా చేసిన అభ్యంతరకరమైన చాట్‌ను సదరు యువతి సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అదే యువతి తాజాగా మరో ఐపీఎల్ ఆటగాడు (డీసీకి చెందిన అభిషేక్ పోరెల్) కూడా తనతో చాట్ చేశాడని పోస్ట్ పెట్టింది. -
వివాదంలో విరాట్ కోహ్లి భక్తుడు
విరాట్ కోహ్లి భక్తుడు, గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన స్వస్తిక్ చికారా వివాదంలో చిక్కుకున్నాడు. రాధికా శర్మ అనే యువతితో అతను చేసిన అభ్యంతరకర సంభాషణ సోషల్‌మీడియాలో లీకైంది. ఇందులో చికారా రాధికాను కేఫ్ లేదా రెస్టారెంట్లో కలవాలని ఒత్తిడి చేశాడు. చికారా రాధికాను కన్పూర్‌లోని ఓ మాల్లో కలిశాడు. ఆ పరిచయంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. విసిగిపోయిన రాధికా చికారా వేధింపులను బయటపెట్టింది. చికారా తనను సోషల్ మీడియాలో స్టాక్ చేసి, ఫ్లర్ట్ మెసేజ్‌లు పంపాడని ఆధారాలతో (చాట్ స్క్రీన్షాట్లు) సహా సోషల్‌మీడియాలో షేర్ చేసింది. లీకైన ఈ చాట్ల వల్ల చికారా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినడంతో పాటు అతని మాజీ జట్టు, డిఫెండింగ్ ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ బ్రాండ్‌కు భంగం వాటిల్లుతుంది. క్రికెటేతర విషయాల కారణంగా ఆర్సీబీ పరువు పోవడం ఇది తొలిసారి కాదు. గతంలో వేర్వేరు ఘటనల్లో అమ్మాయిలను వేధించి, ఇబ్బంది పెట్టాడన్న కారణంగా ప్రస్తుత ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్‌పై ఘాజియాబాద్, జైపూర్‌లో కేసులు నమోదయ్యాయి. యశ్ దయాల్ ఉదంతంతోనే ఆర్సీబీ పరువు గంగలో కలిసింది. తాజాగా చికారా ఎపిసోడ్ ఆ ఫ్రాంచైజీ పరువును మరింత దిగజార్చింది. 17 సీజన్ల పాటు టైటిల్ గెలవలేకపోయినా, ఫ్రాంచైజీగా క్లీన్ ఇమేజ్ కలిగిన ఆర్సీబీ దయాల్, చికారా కారణంగా బజారుకెక్కింది. దయాల్‌ను ఆర్సీబీ 2026 మినీ వేలానికి ముందు అట్టిపెట్టుకోగా.. చికారాను విడుదల చేసింది. చికారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అతను ఆర్సీబీలో ఉండగా కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. యూపీలో జన్మించిన 20 ఏళ్ల చికారాను ఆర్సీబీ 2024 సీజన్లో కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన చికారా విరాట్ కోహ్లిని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తాడు. ఆర్సీబీలో ఉండగా అతనెప్పుడూ విరాట్ వెంటే ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో విరాట్ చికారా అతి వినయానికి తట్టుకోలేక కోపడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. చికారా విరాట్‌ను బాగా విసిగించేవాడని ప్రచారం ఉంది.మొత్తంగా యశ్ దయాల్, చికారా ఉదంతాలు ఆర్సీబీ ప్రతిష్ట దెబ్బ తీశాయి. దీనిపై ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆటగాళ్లను ఎంపిక చేసుకునేప్పుడు వారి బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యానికి సూచిస్తున్నారు.కాగా, ఆర్సీబీ 17 సీజన్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గత సీజన్లోనే తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్‌పై జయకేతనం ఎగురవేసి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపును ఆర్సీబీ ఆటగాళ్లు దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లికి అంకితమిచ్చారు. ఈ గెలుపుతో విరాట్ కోహ్లి పాత్ర కూడా చాలా ఉంది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి టైటిల్ కలను నెరవేర్చుకున్నాడు. అయితే ఈ సంతోషం ఆర్సీబీకి కానీ విరాట్ కోహ్లికి కానీ ఎన్నో గంటలు మిగల్లేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడయంలో జరిగిన విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా బెంగళూరు ఇప్పుడు ఆర్సీబీకి హోం గ్రౌండ్ అయ్యే అర్హత కూడా కోల్పోనుందని తెలుస్తుంది. ఈ ఘటనపై విరాట్ కోహ్లి చాలా విచారం వ్యక్తం చేశాడు. -
ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావాల్సి వస్తే.. ఆరోజే రిటైర్మెంట్: కోహ్లి
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి ఆడాలనేది ఎంతో మంది యువ క్రికెటర్లకు చిరకాల కోరిక. అతడితో కలిసి డ్రెసింగ్ రూమ్ షేర్ చేసుకున్నా చాలని తపించే ప్లేయర్లు ఎందరో!.. ఐపీఎల్-2025 ద్వారా ఉత్తరప్రదేశ్ కుర్రాడు స్వస్తిక్ చికారాకు ఆ కల నెరవేరింది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ప్రాతినిథ్య వహించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.ట్రోఫీని ముద్దాడుతూఅరంగేట్రం చేయకపోయినా.. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ పదిహేడేళ్ల తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టులో చికారా భాగమయ్యాడు. అంతేకాదు.. కోహ్లితో కలిసి ట్రోఫీని ముద్దాడుతూ ఫొటోలకు ఫోజులిస్తూ సంతోషంలో తేలిపోయాడు. ఇరవై ఏళ్ల ఈ యూపీ బ్యాటర్ తాజాగా కోహ్లి గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు.ఆరోజే క్రికెట్‌ను వదిలేస్తాను‘‘‘నేను ఎంత కాలం ఫిట్‌గా ఉంటే.. అంతకాలం క్రికెట్ ఆడతాను. ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రం అస్సలు రాను. సింహంలా ఆడటంలోనే మజా ఉంది. నేను 20 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయగలగాలి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు రావాలి.ఏ రోజైతే నేను ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావాల్సి వస్తుందో ఆరోజే క్రికెట్‌ను వదిలేస్తాను’ అని విరాట్ భయ్యా నాతో చెప్పారు’’ అని స్వస్తిక్ చికారా (Swastik Chikara) రెవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ ఆరంభం నుంచి అంటే.. 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. పరుగుల వరద పారిస్తున్నాడు. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్ ఈసారి అందడంతో ఫుల్ ఖుషీ అయిపోయాడు.వన్డే, ఐపీఎల్లో కొనసాగుతున్న కోహ్లిఇక 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ఇటీవలే టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నాడు ఈ రన్‌మెషీన్.కాగా 36 ఏళ్ల కోహ్లి ఇప్పటి టీమిండియా తరఫున 123 టెస్టుల్లో 9230, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. వన్డేల్లో సచిన్ టెండుల్కర్‌కు కూడా సాధ్యంకాని రీతిలో 51 సెంచరీలు సాధించి.. 14181 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటికి 267 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 8661 రన్స్ రాబట్టాడు.చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. ఓపెనర్‌గా రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రెడ్డికి చోటు


