చెలరేగిన ఫర్హాన్‌, సదాకత్‌.. లంకపై పాక్‌ ఘన విజయం | Pakistan beat Sri lanka in 2nd T20, clinches series | Sakshi
Sakshi News home page

చెలరేగిన ఫర్హాన్‌, సదాకత్‌.. లంకపై పాక్‌ ఘన విజయం

Oct 11 2026 10:10 PM | Updated on Oct 11 2026 10:16 PM

Pakistan beat Sri lanka in 2nd T20, clinches series

source: X

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను పాక్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచిన ఆతిథ్య జట్టు.. ఇవాళ జరిగిన రెండో మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో చెలరేగిన పాక్‌ ఆటగాళ్లు సాహిబ్‌జాదా ఫర్హాన్‌, మాజ్‌ సదాకత్‌ రెండో మ్యాచ్‌లోనూ విజృంభించారు.

తొలి మ్యాచ్‌లో తృటిలో సెంచరీ మిస్‌ (89) చేసుకున్న ఫర్హాన్‌ రెండో టీ20లోనూ భారీ అర్ద సెంచరీ సాధించాడు. తొలి మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీ (50) చేసిన మాజ్‌ సదాకత్‌ రెండో టీ20లో నాలుగు పరుగుల తేడాతో (96) సెంచరీని చేజార్చుకున్నాడు.

ఫర్హాన్‌, సదాకత్‌ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఫకర్‌ జమాన్‌ (22), హసన్‌ నవాజ్‌ (19 నాటౌట్‌) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. లంక బౌలర్లలో తీక్షణ, ఎషాన్‌ మలింగ, షనక తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక చేతులెత్తేసింది. 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్‌ బౌలర్లలో ఇమ్రాన్‌ రంధవ (4-0-11-3) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. సల్మాన్‌ మిర్జా 2, సైమ్‌ అయూబ్‌, షాదాబ్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని నామమాత్రపు చివరి టీ20 అక్టోబర్‌ 13న జరుగనుంది. 

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచ రికార్డు బద్దలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement