source: X
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఏ రికార్డు మిగలనిచ్చేలా లేడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్న అతడు.. తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20లో మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా సహచరుడు, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టాడు.
సూర్య 1164 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేయగా.. అభిషేక్ కేవలం 1023 బంతుల్లోనే ఈ మైలురాయిని అధిగమించాడు. ఈ జాబితాలో అభిషేక్, సూర్య తర్వాతి స్థానాల్లో ఆరోన్ ఫించ్ (1283), మ్యాక్స్‌వెల్ (1304), హార్దిక్ పాండ్యా (1390) ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఇండోర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. సంజూ శాంసన్ (3) త్వరగానే ఔటైనప్పటికీ.. అభిషేక్ శర్మ (67) తన సహజశైలిలో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా ఇషాన్ కిషన్ (31) కూడా బ్యాట్ ఝులిపిస్తున్నాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 109-1గా ఉంది. కాగా, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో, విండీస్ రెండో మ్యాచ్‌లో గెలిచిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: రీఎంట్రీలో సూర్యకుమార్ అట్టర్ ప్లాప్


