రీఎంట్రీలో సూర్యకుమార్‌ అట్టర్‌ ప్లాప్‌ | Suryakumar Yadav Dismissed For 17 Runs On His T20 Comeback Match | Sakshi
Sakshi News home page

రీఎంట్రీలో సూర్యకుమార్‌ అట్టర్‌ ప్లాప్‌

Oct 11 2026 5:05 PM | Updated on Oct 11 2026 5:13 PM

Suryakumar Yadav Dismissed For 17 Runs On His T20 Comeback Match

టీమిండియా స్టార్ బ్యాటర్‌, మాజీ కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌ తన పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇటీవలే రంజీ ట్రోఫీకి ప్రకటించిన ముంబై జట్టులో చోటు దక్కకపోవడంతో, ప్రస్తుతం అతడు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో ఆడుతున్నాడు. అయితే ఈ టోర్నీలో ఎంఐజీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యకుమార్.. ముస్లిం యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు.

స్టంపౌట్‌గా
ముస్లిం యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఐజీ క్లబ్ తరఫున సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో వరుసగా మూడు బౌండరీలు బాది మంచి ఊపు మీదున్నట్లు కనిపించినా..  ఆ జోరును ఎక్కువసేపు కొనసాగించలేకపోయాడు. కేవలం 10 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసి, బౌలర్ కరణ్ భద్రా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.

రాణించిన సహచరులు.. ఎంఐజీ క్లబ్ విజయం
సూర్యకుమార్ విఫలమైనప్పటికీ, ఎంఐజీ క్రికెట్ క్లబ్‌లోని ఇతర బ్యాటర్లు రాణించడంతో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. ఓపెనర్ కౌశిక్ చిఖాలికర్ 24 బంతుల్లో 49 పరుగులతో విరుచుకుపడగా, షీష్ శెట్టి 21 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

రంజీ జట్టులో దక్కని చోటు
వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ 'రంజీ ట్రోఫీ 2026-27' సీజన్‌లో ముంబై తరఫున బరిలోకి దిగాలని భావించాడు. అయితే దాదాపు ఏడాది కాలంగా ఆయన రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండటంతో సెలక్టర్లు ఆయనను రంజీ జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోలేదు. 

తొలి మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఈ క్రమంలో తన మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఫామ్‌ను నిరూపించుకోవడానికి సూర్య ఈ ప్రెసిడెంట్స్ కప్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక్కడ కూడా అతడు నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికి మిగిలిన మ్యాచ్‌లలో అతడు రాణిస్తే తిరిగి రంజీ జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement