breaking news
Presidents Cup
-
రీఎంట్రీలో సూర్యకుమార్ అట్టర్ ప్లాప్
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇటీవలే రంజీ ట్రోఫీకి ప్రకటించిన ముంబై జట్టులో చోటు దక్కకపోవడంతో, ప్రస్తుతం అతడు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో ఆడుతున్నాడు. అయితే ఈ టోర్నీలో ఎంఐజీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యకుమార్.. ముస్లిం యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు.స్టంపౌట్గాముస్లిం యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్య ఛేదనలో ఎంఐజీ క్లబ్ తరఫున సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో వరుసగా మూడు బౌండరీలు బాది మంచి ఊపు మీదున్నట్లు కనిపించినా.. ఆ జోరును ఎక్కువసేపు కొనసాగించలేకపోయాడు. కేవలం 10 బంతుల్లో 17 పరుగులు మాత్రమే చేసి, బౌలర్ కరణ్ భద్రా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు.రాణించిన సహచరులు.. ఎంఐజీ క్లబ్ విజయంసూర్యకుమార్ విఫలమైనప్పటికీ, ఎంఐజీ క్రికెట్ క్లబ్‌లోని ఇతర బ్యాటర్లు రాణించడంతో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. ఓపెనర్ కౌశిక్ చిఖాలికర్ 24 బంతుల్లో 49 పరుగులతో విరుచుకుపడగా, షీష్ శెట్టి 21 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.రంజీ జట్టులో దక్కని చోటువాస్తవానికి సూర్యకుమార్ యాదవ్ 'రంజీ ట్రోఫీ 2026-27' సీజన్లో ముంబై తరఫున బరిలోకి దిగాలని భావించాడు. అయితే దాదాపు ఏడాది కాలంగా ఆయన రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉండటంతో సెలక్టర్లు ఆయనను రంజీ జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోలేదు. తొలి మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఈ క్రమంలో తన మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఫామ్‌ను నిరూపించుకోవడానికి సూర్య ఈ ప్రెసిడెంట్స్ కప్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఇక్కడ కూడా అతడు నిరాశపరిచాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికి మిగిలిన మ్యాచ్‌లలో అతడు రాణిస్తే తిరిగి రంజీ జట్టుకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా -
ప్రెసిడెంట్స్ కప్‌లో తీగల సాహిత్ రెడ్డి
మాంట్రియాల్: భారత సంతతి గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ కప్‌లో అమెరికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత సంతతి గోల్ఫర్గా సాహిత్ చరిత్రకెక్కాడు. గురువారం ప్రారంభమైన ఈ టోర్నీలో అమెరికా జట్టు... యూరోప్ దేశాల మినహా ఇతర దేశాల ఆటగాళ్లతో కూడిన రెస్ట్ ఆఫ్ వరల్డ్ జట్టుతో పోటీపడుతోంది. రాయల్ మాంట్రియాల్ గోల్ఫ్ క్లబ్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో ఆడటం చాలా సంతోషంగా ఉందని పీజీఏ టూర్ టైటిల్ సాధించిన సాహిత్ పేర్కొన్నాడు. సాహిత్ తల్లిదండ్రులు మురళీధర్, కరుణ 1980 దశకంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. సాహిత్ కాలిఫోర్నీయాలో పుట్టి పెరిగాడు. ‘మా నాన్న భారత్ నుంచి అమెరికాకు వచ్చినప్పుడు ఇలాంటి ఒక రోజు వస్తుందని కచ్చితంగా ఊహించి ఉండడు. ప్రెసిడెంట్స్ కప్‌లో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు ఎలా సాగాలో మా నాన్న నుంచే నేర్చుకున్నా. ప్రతిష్టాత్మక టోర్నీలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి మించి ఏం ఉంటుంది. మెరుగైన ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తా. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆడనుండటం మరింత ఉత్సహాన్నిస్తోంది’అని సాహిత్ పేర్కొన్నాడు. 1994 నుంచి ఈ టోర్నీని నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు 14 ఎడిషన్లు జరిగాయి. అందులో 12 సార్లు గెలిచిన అమెరికా జట్టు ఒకసారి ఓడిపోయింది. మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. -
శివ థాపా పసిడి పంచ్
నూర్ సుల్తాన్ (కజకిస్తాన్): 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్ శివ థాపా కజకిస్తాన్ ప్రెసిడెంట్స్ కప్ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. 63 కేజీల విభాగంలో శివ థాపా విజేతగా నిలిచాడు. అతనితో ఫైనల్లో తలపడాల్సిన ప్రత్యర్థి జకీర్ (కజకిస్తాన్) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో శివ థాపాకు వాకోవర్ లభించింది. స్వర్ణం ఖాయమైంది. పురుషుల విభాగంలో భారత్‌కే చెందిన దుర్యోధన్ (69 కేజీలు) కాంస్యం, మహిళల విభాగంలో పర్వీన్ (60 కేజీలు) రజతం, సవీటి బొరా (75 కేజీలు) కాంస్యం సాధించారు. -
అమ్మాయిల ‘పట్టు’ అదిరింది
ప్రెసిడెంట్ కప్ రెజ్లింగ్ టోర్నీలో రన్నరప్ భారత్ అస్తానా (కజకిస్తాన్): ప్రెసిడెంట్ కప్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత మహిళా రెజ్లింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్‌కు తొమ్మిది పతకాలు వచ్చాయి. వినేశ్ (48 కేజీలు), లలితా షెరావత్ (55 కేజీలు), అనిత (63 కేజీలు) అజేయంగా నిలిచి స్వర్ణ పతకాలు సాధించగా... సాక్షి మలిక్ (58 కేజీలు) రజత పతకాన్ని దక్కించుకుంది. నిర్మలా దేవి (53 కేజీలు), సరిత (60 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (69 కేజీలు), నిక్కీ (75 కేజీలు) కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. రన్నరప్‌గా నిలిచిన భారత్‌కు 10 వేల డాలర్లు ప్రైజ్‌మనీగా లభించాయి. ఆతిథ్య దేశం కజకిస్తాన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, మంగోలియా మూడో స్థానంలో నిలిచింది. వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు సన్నాహ కంగా భారత్ ఈ టోర్నీలో ఆడింది.


