శివ థాపా పసిడి పంచ్‌

Shiva Thapa becomes India's first gold-medallist in Kazakhstan Presidents Cup - Sakshi

ప్రెసిడెంట్స్‌ కప్‌ బాక్సింగ్‌ టోర్నీ

నూర్‌ సుల్తాన్‌ (కజకిస్తాన్‌): 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బాక్సర్‌ శివ థాపా కజకిస్తాన్‌ ప్రెసిడెంట్స్‌ కప్‌ టోర్నీ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. 63 కేజీల విభాగంలో శివ థాపా విజేతగా నిలిచాడు. అతనితో ఫైనల్లో తలపడాల్సిన ప్రత్యర్థి జకీర్‌ (కజకిస్తాన్‌) గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో శివ థాపాకు వాకోవర్‌ లభించింది. స్వర్ణం ఖాయమైంది.  పురుషుల విభాగంలో భారత్‌కే చెందిన దుర్యోధన్‌ (69 కేజీలు) కాంస్యం, మహిళల విభాగంలో పర్వీన్‌ (60 కేజీలు) రజతం, సవీటి బొరా (75 కేజీలు) కాంస్యం సాధించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top