కజకిస్తాన్‌ ప్లేయర్‌ బుబ్లిక్‌ సంచలనం | Alexander Bublik stuns top-ranked Jannik Sinner at Halle | Sakshi
Sakshi News home page

కజకిస్తాన్‌ ప్లేయర్‌ బుబ్లిక్‌ సంచలనం

Jun 21 2025 1:30 PM | Updated on Jun 21 2025 2:50 PM

Alexander Bublik stuns top-ranked Jannik Sinner at Halle

హాలె (జర్మనీ): హాలె ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినెర్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. కజకిస్తాన్‌కు చెందిన ప్రపంచ 45వ ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ అద్భుత ఆటతీరుతో సినెర్‌ను బోల్తా కొట్టించి తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని అందుకున్నాడు. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బుబ్లిక్‌ 3–6, 6–3, 6–4తో టాప్‌ సీడ్‌ సినెర్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 2 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 82 కేజీల బరువున్న బుబ్లిక్‌ 15 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.

తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయిన బుబ్లిక్‌ ప్రత్యర్థి సరీ్వస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. ఇటీవల ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన సినెర్‌ ఈ మ్యాచ్‌లో ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. 30 విన్నర్స్‌ కొట్టిన ఈ ఇటాలియన్‌ ప్లేయర్‌ 25 అనవసర తప్పిదాలు చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సినెర్‌ మూడు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయాడు. అల్‌కరాజ్‌తో జరిగిన రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టోర్నీ ఫైనల్లో, ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓడిన సినెర్‌ తాజాగా బుబ్లిక్‌ చేతిలో ఓడిపోయాడు. సినెర్‌ను ఓడించిన ఉత్సాహంలో బుబ్లిక్‌ హాలె ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్లో బుబ్లిక్‌ 7–6 (7/2), 6–3తో ప్రపంచ 23వ ర్యాంకర్, ఏడో సీడ్‌ టామస్‌ మఖాచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలుపొందాడు.

Advertisement
 
Advertisement
Advertisement