చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా | Devdutt Padikkal Becomes 2nd Batter After Joe Root To Achieve Rare WTC Feat With Back to Back Centuries, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా

Aug 23 2026 5:46 PM | Updated on Aug 23 2026 6:54 PM

Devdutt Padikkal becomes 2nd batter after Joe Root to achieve rare WTC feat

చేతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో భారత జట్టుకు మూడో స్ధానం పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. సాయిసుదర్శన్‌, కరుణ్ నాయర్ వంటి ఆటగాళ్లను ప్రయోగించినప్పటికి పుజారా స్ధానాన్ని భర్తీ చేయలేకపోయాడు. అయితే ఎట్టకేలకు పుజారా వారుసుడు దొరికాడు. 

మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు. అతడే కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్‌. దాదాపు మూడేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన పడిక్కల్ శతకాల మోత మోగిస్తున్నాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో సత్తాచాటిన పడిక్కల్‌.. ఇప్పుడు కొలంబోలో కూడా అద్భుత శతకంతో కదం తొక్కాడు. 193 బంతుల్లో 12 ఫోర్లతో 117 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో పడిక్కల్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఒకే సిరీస్‌లో మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి ఒకటి కంటే ఎక్కువ సెంచ‌రీలు చేసిన రెండో బ్యాట‌ర్‌గా ప‌డిక్క‌ల్ నిలిచాడు. ఇంత‌కుమందు ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాత్రమే ఈ ఘ‌న‌త సాధించాడు. 

ఇప్పుడు రూట్ స‌ర‌స‌న ప‌డిక్క‌ల్ చేరాడు. అంతేకాకుండా విదేశీ గ‌డ్డ‌పై భార‌త జ‌ట్టు త‌ర‌పున మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి వ‌రుస‌గా సెంచ‌రీలు చేయ‌డం 2019 త‌ర్వాత ఇదే తొలిసారి. చివ‌ర‌గా 2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పుజారా వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు చేశాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఈ ఫీట్‌ను దేవ్‌ద‌త్త్ న‌మోదు చేశాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్‌.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement