కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాటర్లు సత్తాచాటారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్(117) మరోసారి సెంచరీతో కదం తొక్కగా.. శుబ్‌మన్ గిల్(50), యశస్వి జైశ్వాల్(45), రవీంద్ర జడేజా(43) రాణించారు. ప్రస్తుతం క్రీజులో ద్రువ్ జురెల్(7), సారాన్ష్ జైన్(4) ఉన్నారు.
శ్రీలంక బౌలర్లలో అసిథ ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టగా.. లహిరు కుమారా, కేశర నువాంత తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు.
బ్యాటింగ్ చేస్తుండగా కుమార వేసిన బంతి పంత్ ఎడమ చేతి మణికట్టుకు బలంగా తాకింది. దీంతో తీవ్రమైన నొప్పితో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. పంత్ గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే రెండో ప్లేయర్‌గా


