సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్‌ | Duleep Trophy 2026 Quarter Finals, Sudip Gharami, Shahbaz Ahmed Slams 100s After Vaibhav Sooryavanshi And Ishan Kishan Flop | Sakshi
Sakshi News home page

సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్‌

Aug 23 2026 6:25 PM | Updated on Aug 23 2026 6:53 PM

Duleep Trophy Quarter Finals: Sudip Gharami, Shahbaz Ahmed Slams 100s After Vaibhav Sooryavanshi, Ishan Kishan Flop

source: BCCI X

దులీప్‌ ట్రోఫీ 2026లో భాగంగా ఇవాళ (ఆగస్ట్‌ 23) మొదలైన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఈస్ట్‌ జోన్‌-నార్త్‌ ఈస్ట్‌ జోన్‌.. నార్త్‌ జోన్‌-ఈస్ట్‌ జోన్‌ జట్లు తలపడుతున్నాయి. తొలి క్వార్టర్‌ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఈస్ట్‌ జోన్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది.

రెండో క్వార్టర్‌ ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్త్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఈస్ట్‌ జోన్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.

సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్‌
నార్త్‌ ఈస్ట్‌ జోన్‌తో జరుగుతున్న తొలి క్వార్టర్‌ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ ప్లేయర్లు సుదీప్‌ కుమార్‌ ఘరామీ (146), షాబాజ్‌ అహ్మద్‌ (100 బ్యాటింగ్‌) సెంచరీలతో కదంతొక్కారు. ఈ జట్టు స్టార్‌ ప్లేయర్లు, కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్లు ఇషాన్‌ కిషన్‌ (4), వైభవ్‌ సూర్యవంశీ (8) నిరాశపరిచారు. 

మిగతా ప్లేయర్లలో అభిమన్యు ఈశ్వరన్‌ 15, కుమార్‌ కుషాగ్రా 55, విరాట్‌ సింగ్‌ 2, అనుకూల్‌ రాయ్‌ 22 (బ్యాటింగ్‌) చేశారు. నార్త్‌ ఈస్ట్‌ జోన్‌ బౌలర్లలో జొతిన్‌ 3, ఆకాశ్‌ చౌదరి 2, బిష్వోర్జిత్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

సత్తా చాటిన తనుశ్‌, తుషార్‌
నార్త్‌ జోన్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్‌ ఫైనల్లో వెస్ట్‌ జోన్‌ బౌలర్లు తనుశ్‌ కోటియన్‌ (4-72), తుషార్‌ దేశ్‌పాండే (4-57) సత్తా చాటారు. వీరికి ముకేశ్‌ చౌదరి (1-47), శార్దూల్‌ ఠాకూర్‌ (1-38) సహకరించారు. నార్త్‌ జోన్‌ ప్లేయర్లలో తొమ్మిదో నంబర్‌ ఆటగాడు అన్షుల్‌ కంబోజ్‌ (60) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

ఇతనితో పాటు ఆయుశ్‌ బదోని (51), ఆయుశ్‌ దొసేజా (42) రాణించారు. కమ్రాన్‌ ఇక్బాల్‌ 26, యశ్‌ ధుల్‌ 9, అబ్దుల్‌ సమద్‌ 6, కన్హయ్య వధవాన్‌ 5, నిషాంత్‌ సింధు 15, అబిద్‌ ముస్తాక్‌ 19, అర్షదీప్‌ సింగ్‌ 4, సునీల్‌ కుమార్‌ 0 (నాటౌట్‌) పరుగులు చేశారు.

అనంతరం వెస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించగా.. పృథ్వీ షా (22) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఆబిద్‌ ముస్తాక్‌ అద్భుతమైన బంతితో అతన్ని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మరో ఓపెనర్‌ హార్విక్‌ దేశాయ్‌ను (3) అర్షదీప్‌ సింగ్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆట ముగిసే సమయానికి ముషీర్‌ ఖాన్‌ (6), శివాలిక్‌ శర్మ (0) క్రీజ్‌లో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement