'రాహుల్‌ ఆ షాట్‌ ఆడుతాడని ఊహించలేదు' | Venkatesh Prasad on India openers poor dismissal in Colombo Test | Sakshi
Sakshi News home page

IND vs SL: 'రాహుల్‌ ఆ షాట్‌ ఆడుతాడని ఊహించలేదు'

Aug 23 2026 8:21 PM | Updated on Aug 23 2026 8:22 PM

Venkatesh Prasad on India openers poor dismissal in Colombo Test

PC: X

కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ నిరాశ‌ప‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు.

భార‌త ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్ వేసిన లహిరు కుమార బౌలింగ్‌లో కాస్త నిర్ల‌క్ష్యంగా షాట్‌ ఆడిన రాహుల్‌.. వికెట్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు. ఈ నేప‌థ్యంలో రాహుల్ షాట్ సెలక్షన్‌పై భార‌త‌ మాజీ క్రికెట‌ర్ వెంకటేష్ ప్రసాద్ ఆసంతృప్తి వ్యక్తం చేశాడు. 

"కేఎల్ రాహుల్ ఆ షాట్ ఆడుతాడని అస్సలు ఊహించలేదు. అదే ఓవర్‌లో అతడు పుల్ షాట్‌ ద్వారా ఫోర్ బాదాడు. బహుశా ఆ ఆత్మవిశ్వాసంతోనే తొందరపడి అనవసర షాట్ ఆడాడు. ఇది రాహుల్ బ్యాటింగ్ స్టైల్ కాదు. ఎందుకంటే ఆఫ్ వికెట్‌కు చాలా దూరంగా వెళ్తున్న బంతికి అలాంటి షాట్లు ఆడే అల‌వాటు రాహుల్‌కు లేదు. 

కేఎల్ అప్ప‌టికే క్రీజులో సెటిలయ్యాడు. ఎప్పుడూ ఓపిక‌గా క్రీజులో సమయం గడిపే అతడు ఈసారి తొందరపడి త‌న వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అద్భుతంగా ఉంది. రాహుల్ ఎక్క‌వ స‌మ‌యం పాటు క్రీజులో ఉండి ఉంటే బాగుండేది" అని సోనీ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌సాద్ పేర్కొన్నాడు.

కాగా తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త జ‌ట్టు 5 వికెట్ల న‌ష్టానికి 300 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(117) అద్భుత సెంచరీతో సత్తా చాటాడు. అతడితో పాటు శుబ్‌మన్‌ గిల్‌(50), రవీంద్ర జడేజా(43), యశస్వి జైశ్వాల్‌(45) రాణించారు.
చదవండి: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. విధ్వంకర వీరుడి బ్యాటింగ్‌కు లైన్‌ క్లియర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement