మహిళల చాంపియన్‌ అర్జెంటీనా | Argentina wins Womens Hockey World Cup after 16 years | Sakshi
Sakshi News home page

మహిళల చాంపియన్‌ అర్జెంటీనా

Aug 30 2026 3:46 AM | Updated on Aug 30 2026 3:46 AM

Argentina wins Womens Hockey World Cup after 16 years

మూడో సారి వరల్డ్‌ కప్‌ కైవసం 

ఫైనల్లో నెదర్లాండ్స్‌పై 3–1తో విజయం

ఆమ్‌స్టెల్‌వీన్‌: మహిళల హాకీ ప్రపంచ కప్‌లో 16 ఏళ్ల తర్వాత అర్జెంటీనా విజేతగా నిలిచింది. ఈ క్రమంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ నెదర్లాండ్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది. 2022 టోర్నీ ఫైనల్లో నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిన అర్జెంటీనా ఇప్పుడు అదే ప్రత్యర్థిని తుది పోరులో చిత్తు చేసి వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఫైనల్లో నెదర్లాండ్స్‌ చేతిలో 1–3 స్కోరుతో ఓడిన టీమ్‌ ఇప్పుడు అదే స్కోరు 3–1తోనే (షూటౌట్‌) ప్రత్యర్థిని ఓడించడం విశేషం. 

గత మూడు ప్రపంచ కప్‌లను గెలుచుకున్న తర్వాత వరుసగా నాలుగో, ఓవరాల్‌గా పదో టైటిల్‌పై గురి పెట్టిన ఆతిథ్య నెదర్లాండ్స్‌ చివరకు రన్నరప్‌గా సంతృప్తి చెందింది. 2002, 2010లలో ట్రోఫీని అందుకున్న అర్జెంటీనా విజేతగా నిలవడం ఇది మూడో సారి కావడం విశేషం. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. నెదర్లాండ్స్‌ తరఫున 30వ నిమిషంలో యాన్సెన్‌ యిబీ గోల్‌ సాధించింది.

అయితే మరో ఆరు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా గ్రానటో మారియా (54వ నిమిషం) కొట్టిన గోల్‌తో అర్జెంటీనా స్కోరును సమం చేసింది. దాంతో పోరు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. నెదర్లాండ్స్‌ తరఫున గ్రానటో విక్టోరియా, బ్రగెసెర్‌ బ్రిసా, కియోరా సోఫీయా గోల్స్‌ కొట్టగా... డచ్‌ బృందంనుంచి వీన్‌ మారిన్‌ మాత్రమే గోల్‌ కొట్టగలిగింది. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 1–0తో నెగ్గిన బెల్జియంకు మూడో స్థానం దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement