జర్మనీని చిత్తు చేసిన భారత్.. హాకీ ప్రపంచకప్‌లో అరుదైన రికార్డు | Hockey World Cup: Navneet Kaurs Brace Helps India Women Beat Germany 3-1 | Sakshi
Sakshi News home page

జర్మనీని చిత్తు చేసిన భారత్.. హాకీ ప్రపంచకప్‌లో అరుదైన రికార్డు

Aug 27 2026 9:30 PM | Updated on Aug 27 2026 9:30 PM

Hockey World Cup: Navneet Kaurs Brace Helps India Women Beat Germany 3-1

మహిళల హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమైన భారత జట్టు.. ఇప్పుడు ఐదో స్దానం సాధించి టోర్నీని ముగించింది. గురువారం ఐదో స్థానం కోసం జ‌ర్మ‌నీతో జ‌రిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భార‌త్  3-1 తేడాతో ఘన విజయం సాధించింది. మహిళల ప్రపంచకప్ చరిత్రలోనే భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 

ఈ మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జ‌ట్లు గోల్ కోసం తీవ్రంగా శ్ర‌మించాయి. ఫస్ట్ హాఫ్ స‌మ‌యానికి  ఏ జట్టూ గోల్ నమోదు చేయలేకపోయింది. అయితే మూడో క్వార్ట‌ర్‌లో మాత్రం భార‌త ప్లేయ‌ర్లు స‌త్తాచాటారు. మ్యాచ్ 43వ నిమిషంలో ఈషిక అద్భుతమైన గోల్‌తో భార‌త్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది.

ఆ తర్వాత స్ట్రైకర్ నవ్‌నీత్ కౌర్ రెండు గోల్స్‌తో మెరిసి జ‌ట్టును 3-0 ఆధిక్యంలో తీసుకెళ్లింది. మ్యాచ్ ముగిసే సమయానికి జర్మనీ తరఫున లిన్ క్రింగ్స్ ఒక ఫీల్డ్ గోల్ సాధించి ఖాతా తెరిచిన‌ప్ప‌టికి.. భార‌త్ 3-1 తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది.
చదవండి: IND vs SL: 90 బంతులు.. 12 పరుగులు! నీ ఓపికకు ఓ దండం సామీ?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement