హాకీ మహిళల ప్రపంచకప్-2026లో ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకుంది. దీంతో భారత అమ్మాయిల జట్టు పూల్-డిలో కీలక పాయింట్ సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. నాలుగు క్వార్టర్స్‌లోనూ ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించకపోవడంతో మ్యాచ్ డ్రా ముగిసింది.
తొలి క్వార్టర్‌లో భారత జట్టు అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. పెనాల్టీ కార్నర్‌లో నవ్‌నీత్ కౌర్ బంతిని నెట్‌లోకి పంపినప్పటికీ, అది భారత ప్లేయర్ శరీరానికి తగలడంతో గోల్‌ను అనుమతించలేదు. మరోవైపు ఇంగ్లండ్‌కు వరుస పెనాల్టీ కార్నర్లు లభించాయి.
అయితే భారత గోల్‌కీపర్ సవితా పునియా, డిఫెండర్ సలీమా టెటే అద్భుతమైన డిఫెన్స్‌తో ఇంగ్లండ్‌కు గోల్ సాధించే అవకాశాలు ఇవ్వలేదు. కాగా పూల్ డి నుంచి చైనా, భారత్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా.. ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు ఇంటి ముఖం పట్టాయి.


