భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు | India, Pakistan Players Skip Handshakes Before Match, But What Happened After Full Time Wins Hearts | Sakshi
Sakshi News home page

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు

Aug 20 2026 11:10 AM | Updated on Aug 20 2026 11:21 AM

India, Pakistan Players Skip Handshakes Before Match, But What Happened After Full Time Wins Hearts

source: X

భారత్–పాకిస్తాన్ పురుషుల హాకీ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ సందర్భంగా పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో మైదానంలో తీవ్రమైన పోటీ కనిపించినప్పటికీ.. మ్యాచ్‌కు ముందు, తర్వాత ఆటగాళ్లు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి ప్రత్యేకంగా నిలిచింది. భారత్ 5-3తో పాకిస్తాన్‌ను ఓడించి ప్రపంచకప్‌లో తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు సంప్రదాయ హ్యాండ్‌షేక్‌కు బదులుగా హై-ఫైలు ఇచ్చుకున్నారు. ఇరు దేశాల మధ్య ఇటీవలి రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దృశ్యం ఆసక్తిని రేకెత్తించింది. ముఖ్యంగా క్రికెట్‌లో భారత్–పాకిస్తాన్ జట్ల మధ్య హ్యాండ్‌షేక్ అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో హాకీ ఆటగాళ్ల వైఖరి భిన్నంగా కనిపించింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్‌షేక్ చేసుకున్నారు. విజయం, ఓటమిని పక్కనపెట్టి ప్రత్యర్థి ఆటగాళ్లను గౌరవిస్తూ వారు ఒకరినొకరు అభినందించుకున్నారు. మ్యాచ్ అనంతరం కనిపించిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

భారత్ ఘన విజయం
మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా, అభిషేక్ కూడా రెండు గోల్స్ సాధించాడు. హార్దిక్ సింగ్ మరో గోల్‌తో భారత్ స్కోరును 5కు చేర్చాడు. పాకిస్తాన్ తరఫున హన్నన్ షాహిద్ రెండు, సుఫ్యాన్ ఖాన్ ఒక గోల్ చేశారు.

పాకిస్తాన్ మూడు గోల్స్‌తో పునరాగమనానికి ప్రయత్నించినా, భారత్ చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుని 5-3 విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో భారత్ తదుపరి రౌండ్‌కు చేరగా, పాకిస్తాన్ ప్రపంచకప్ ప్రయాణాన్ని ముగించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement