పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో భారత్ తిరిగి గెలుపు బాట పట్టింది. ఆమ్‌స్టల్‌వీన్ వేదికగా చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో జరిగిన పూల్-డి కీలక మ్యాచ్‌లో 5-3 తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో భారత్ రెండవ రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచే భారత జట్టు దూకుడు ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఫార్వర్డ్ అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగారు. దీంతో మ్యాచ్ రెండో క్వార్టర్ పూర్తయ్యేసరికి భారత్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.
ఆ తర్వాత మూడో క్వార్టర్‌లో పాక్ పుంజుకుని రెండు గోల్స్ సాధించినప్పటికి.. భారత్ వెంటనే మరో గోల్ కొట్టి 4-2 ఆధిక్యాన్ని కొనసాగించింది. చివరి క్వార్టర్‌లో పాక్ మరో గోల్ కొట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికి.. భారత డిఫెండర్లు మాత్రం బలంగా నిలిచారు. దీంతో దాయాది జట్టు మూడు గోల్స్‌కు పరిమితమై ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
చదవండి: IND vs SL: ఓటమి బాధలో ఉన్న శ్రీలంకకు మరో భారీ షాక్


