ఓటమి బాధలో ఉన్న శ్రీలంకకు మరో భారీ షాక్‌ | Dinesh Chandimal Ruled Out Of India vs Sri Lanka Test Series | Sakshi
Sakshi News home page

IND vs SL: ఓటమి బాధలో ఉన్న శ్రీలంకకు మరో భారీ షాక్‌

Aug 19 2026 7:05 PM | Updated on Aug 19 2026 7:19 PM

Dinesh Chandimal Ruled Out Of India vs Sri Lanka Test Series

PC: X

గాలే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఘోర ఓటమిపాలైన శ్రీలంకకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ చండీమాల్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాలే టెస్టు నాలుగో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా చండీమాల్ గాయపడ్డాడు. 

లెగ్-సైడ్ బౌండరీ వద్ద బంతిని ఆపే ప్రయత్నంలో అతడి తలకు, భుజానికి గాయమైంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో దినేష్ బ్యాటింగ్‌కు రాలేదు. అతడి స్ధానంలో పసిందు సూరియబండార కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. అయితే ఐసీసీ రూల్ ప్రకారం.. కంక‌ష‌న్‌కు గురైన ఆట‌గాడు ఖ‌చ్చితంగా 7 రోజుల పాటు మైదానానికి దూరంగా ఉండాలి. 

ఈ నిబంధన కారణంగానే  కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు చండీమాల్ అందుబాటులో లేడు. ఈ విషయాన్ని గ్యారీ కిర్‌స్టన్ ధ్రువీకరించాడు. "కొలంబో టెస్టుకు దినేష్ చండీమాల్ అందుబాటులో ఉండటం లేదు. కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టుకు ఎదురు దెబ్బగానే చెప్పాలి. అయితే ఇది యంగ్ ప్లేయర్లకు మంచి అవకాశం. 

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వారిలో ఎవరో ఒకరికి తుది జట్టులో ఛాన్స్ ఇస్తామని" కిర్‌స్టన్ పేర్కొన్నాడు. మరోవైపు తొలి టెస్టుకు దూరమైన యువ ఓపెనర్ పాథుమ్ నిస్సాంక.. కొలంబో టెస్టులో కూడా ఆడేది అనుమానమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement