శ్రేయ‌స్ చ‌రిత్ర‌.. కెప్టెన్‌గా ఎవ‌రికీ సాధ్యం కాని ఫీట్! | Shreyas Iyer Only-Indian Captain-T20I Century-During Run-Chase | Sakshi
Sakshi News home page

శ్రేయ‌స్ చ‌రిత్ర‌.. కెప్టెన్‌గా ఎవ‌రికీ సాధ్యం కాని ఫీట్!

Oct 7 2026 7:14 AM | Updated on Oct 7 2026 7:19 AM

Shreyas Iyer Only-Indian Captain-T20I Century-During Run-Chase

Photo Credit: BCCI Twitter

ల‌క్నో వేదికగా వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. భార‌త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అజేయ సెంచ‌రీతో జ‌ట్టును గెలిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ టీ20ల్లో అరుదైన ఫీట్ సాధించాడు. చేజింగ్‌లో సెంచ‌రీ చేసిన తొలి భార‌త కెప్టెన్‌గా ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

గ‌తంలో ఇదే వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లి చేజింగ్‌లో చేసిన 94 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్ ఇప్ప‌టివ‌ర‌కు అత్యుత్త‌మ స్కోరుగా ఉంది. తాజాగా కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన‌ శ్రేయ‌స్ చ‌రిత్ర సృష్టించాడు. ఇక ఓవ‌రాల్‌గా చూసుకుంటే టీ20ల్లో భార‌త కెప్టెన్‌గా సెంచ‌రీ చేసిన మూడో ఆట‌గాడిగా శ్రేయ‌స్ నిలిచాడు. రోహిత్ శ‌ర్మ కెప్టెన్ హోదాలో మూడుసార్లు శ‌త‌కాలు బాద‌గా, సూర్య‌కుమార్ యాద‌వ్ ఒక‌సారి సెంచ‌రీ సాధించాడు. తాజాగా వీరి స‌ర‌స‌న శ్రేయ‌స్ అయ్య‌ర్ చోటు సంపాదించాడు.

👉ఇక టీ20 క్రికెట్‌లో ఛేద‌నలో భార‌త్ త‌ర‌ఫున సెంచ‌రీ చేసిన నాలుగో ఆట‌గాడిగా శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డులకెక్కాడు. గ‌తంలో సూర్య‌కుమార్ (117) ఒక‌సారి, కేఎల్ రాహుల్ (110 నాటౌట్‌, 101 నాటౌట్‌) రెండుసార్లు, రోహిత్ శ‌ర్మ (100 నాటౌట్‌) ఒక‌సారి సెంచ‌రీలు చేశారు.

👉వెస్టిండీస్‌పై టీ20ల్లో సెంచరీ చేసిన మూడో క్రికెట‌ర్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్ నిలిచాడు. గ‌తంలో రోహిత్ శ‌ర్మ (111 నాటౌట్‌, 2018లో), కేఎల్ రాహుల్ (110 నాటౌట్‌, 2016లో) శ‌త‌కాలు సాధించారు.

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగుల‌కు ఆలౌటైంది. రూథ‌ర్‌పోర్డ్ (56), కెప్టెన్ హోప్ (52) అర్థ‌సెంచ‌రీల‌తో చెల‌రేగారు. భార‌త బౌల‌ర్ల‌లో న‌మ‌న్ ధీర్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాట‌గా, అక్ష‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ యాద‌వ్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం భార‌త జ‌ట్టు 14.4 ఓవ‌ర్ల‌లోనే 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 172 ప‌రుగులు చేసి విజ‌యాన్ని సాధించింది. శ్రేయ‌స్  అయ్య‌ర్ (43 బంతుల్లో 102 నాటౌట్‌), ఇషాన్ కిష‌న్ (37 నాటౌట్‌) జ‌ట్టును గెలిపించారు. విండీస్ బౌల‌ర్ల‌లో అకిల్ హొసెన్, రోస్ట‌న్ చేజ్‌లు చెరొక వికెట్ తీశారు.

ఇదీ చదవండి: శ్రేయస్‌ సెంచరీ మెరుపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement