శతక్కొట్టిన శ్రేయస్‌.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం | India beat west indies in 1st T20I | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన శ్రేయస్‌.. తొలి టీ20లో టీమిండియా ఘన విజయం

Oct 6 2026 10:19 PM | Updated on Oct 6 2026 10:21 PM

India beat west indies in 1st T20I

source: X

లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌ విండీస్‌ను 171 పరుగులకే (19.1 ఓవర్లు) ఆలౌట్‌ చేసింది. అనంతరం శ్రేయస్‌ అయ్యర్‌ మెరుపు శతకంతో విరుచుకుపడటంతో భారత్‌ 14.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో భారత్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. రెండో టీ20 అక్టోబర్‌ 9న రాంచీలో జరుగనుంది.

అరంగేట్రంలోనే అదరగొట్టిన నమన్‌ ధిర్‌
ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన నమన్‌ ధిర్‌ చెలరేగిపోయాడు. 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నమన్‌తో పాటు కుల్దీప్‌ యాదవ్‌ (2-33), అక్షర్‌ పటేల్‌ (2-26), అర్షదీప్‌ సింగ్‌ (1-34) కూడా రాణించడంతో విండీస్‌ ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో హోప్‌ (52), రూథర్‌ఫోర్డ్‌ (56) మెరుపు అర్ద సెంచరీలతో రాణించారు.

శతక్కొట్టిన శ్రేయస్‌
172 పరుగుల ఛేదనలో భారత్‌కు ఎప్పటిలాగే మెరుపు ఆరంభం లభించింది. అభిషేక్‌ (21), సంజూ (11) ఛేదనను ధాటిగా ప్రారంభించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్‌ కావడంతో భారత్‌ను గెలిపించే బాధ్యత శ్రేయస్‌ తన భుజాలపై వేసుకున్నాడు. ఈ క్రమంలో ధాటిగా ఆడుతూ 42 బంతుల్లోనే సెంచరీ (10 ఫోర్లు, 6 సిక్సర్లు) పూర్తి చేశాడు. అతడికి ఇషాన్‌ కిషన్‌ (37 నాటౌట్‌) సహకరించాడు. సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన శ్రేయస్‌ 102 పరుగులతో అజేయంగా మ్యాచ్‌ను ముగించాడు. 

ఇదీ చదవండి: న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement