IND VS NZ 1st Test: రిషబ్‌ పంత్‌ మరో భారీ 'సిక్సర్ల' రికార్డు | Rishabh Pant Rewrites Six Hitting Record With Fifty vs New Zealand | Sakshi
Sakshi News home page

IND VS NZ 1st Test: రిషబ్‌ పంత్‌ మరో భారీ 'సిక్సర్ల' రికార్డు

Nov 21 2026 12:52 PM | Updated on Nov 21 2026 1:13 PM

Rishabh Pant Rewrites Six Hitting Record With Fifty vs New Zealand

source: X

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ టెస్ట్‌ల్లో మరో భారీ సిక్సర్ల రికార్డు సాధించాడు. ఇప్పటికే టెస్ట్‌ల్లో 100 సిక్సర్ల అత్యంత అరుదైన మైలురాయిని (నాలుగో బ్యాటర్‌) తాకిన అతడు.. తాజాగా సేనా (SENA) దేశాల్లో 50 సిక్సర్లు (టెస్ట్‌ల్లో) బాదిన తొలి ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న సచిన్‌ టెండూల్కర్‌ (23 సిక్సర్లు) కంటే పంత్‌ రెండింతలు అధికంగా సిక్సర్లు బాదాడు.

వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పంత్‌ ఈ ఘనత సాధించాడు.  ఈ మ్యాచ్‌లో 2 సిక్సర్లు బాదిన అతడు, తన మొత్తం టెస్ట్‌ సిక్సర్ల సంఖ్యను 104కు పెంచుకున్నాడు.

సేనా దేశాల్లో టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆసియా ఆటగాళ్లు
-  50 -  రిషబ​్‌ పంత్‌
- 23 - సచిన్‌ టెండూల్కర్‌
- 21 - కపిల్‌ దేవ్‌
- 18 - రోహిత్‌ శర్మ
- 18 - రవీంద్ర జడేజా
- 17 - ఎంఎస్‌ ధోని
- 17 - మహమ్మద్‌ యూసుఫ్‌
- 17 - యూనిస్‌ ఖాన్‌

22వ అర్ధసెంచరీ
ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌  ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌, ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 55 బంతుల్లోనే తన 22వ టెస్ట్‌ అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  మూడో రోజు ఆట ముగిసే సమయానికి పంత్‌ 55 పరుగులతో అజేయంగా ఉన్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. పంత్‌ సహా టాప్‌-5 బ్యాటర్లంతా కనీసం అర్ద సెంచరీ చేయడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ వద్ద కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసి, న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌పై 118 పరుగుల లీడ్‌ సాధించింది.

భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (136) సెంచరీతో కదంతొక్కగా.. శుభ్‌మన్‌ గిల్‌ (98) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. యశస్వి జైస్వాల్‌ (85), దేవదత్‌ పడిక్కల్‌ (80) కూడా సెంచరీలకు చేరువలో ఔటయ్యారు. ఆట ముగిసే సమయానికి పంత్‌తో పాటు అన్షుల్‌ కంబోజ్‌ (0) క్రీజ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌, జేకబ్‌ డఫీ, నాథన్‌ స్మిత్‌ తలో వికెట్‌ తీశారు.

అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. హెన్రీ నికోల్స్‌ (175 నాటౌట్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (118) సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో బుమ్రా 4, ఆకాశ్‌దీప్‌ 3, అన్షుల్‌ కంబోజ్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ పడగొట్టారు.

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement