పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. బాబర్‌, రిజ్వాన్‌లకు భారీ షాక్‌ | PCB Announces Pakistan Central Contract For 2026-27 Season | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. బాబర్‌, రిజ్వాన్‌లకు భారీ షాక్‌

Nov 21 2026 12:37 PM | Updated on Nov 21 2026 12:53 PM

PCB Announces Pakistan Central Contract For 2026-27 Season

PC: PCB/X

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. 2026-27 సీజన్‌కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను శనివారం ప్రకటించింది.  మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీ ఈసారి సరికొత్తగా ఫార్మాట్ ఆధారిత  కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. 38 మంది ఆటగాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కగా.. కీలక ఆటగాళ్లకు భారీ షాక్‌లు తగిలాయి.  ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ కేసులో  విచారణ ఎదుర్కొంటున్న స్టార్‌ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను పీసీబీ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి పూర్తిగా తప్పించింది.

అదేవిధంగా టెస్టు కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ ప్లేయర్ సల్మాన్ అఘాకు టీ20 కాంట్రాక్ట్ దక్కలేదు. వీరిద్దరూ వన్డే, టెస్టు కాంట్రాక్ట్‌లో మాత్రం చోటు దక్కించుకున్నారు. అలాగే స్టార్ పేసర్‌ షాహీన్ షా అఫ్రిదికి వన్డే, టీ20 కాంట్రాక్ట్ మాత్రమే లభించగా, టెస్ట్ కాంట్రాక్ట్ నుంచి అతడిని పక్కన పెట్టారు. అయితే ఆశ్చర్యకరంగా ఈసారి ఏ ఒక్క ఆటగాడికి కూడా మూడు ఫార్మాట్ల (టెస్ట్, వన్డే, టీ20) కాంట్రాక్ట్ దక్కకపోవడం గమనార్హం.

పీసీబీ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు వీరే

కాంట్రాక్ట్‌ (టెస్ట్ అండ్ వన్డే)
బాబర్ ఆజం, సల్మాన్ అలీ అఘా

కాంట్రాక్ట్ (టెస్ట్‌)
అజాన్ అవైస్, మహ్మద్ అబ్బాస్, సాజిద్ ఖాన్ మరియు సౌద్ షకీల్

కాంట్రాక్ట్ (వన్డే, టీ20)
అబ్రార్ అహ్మద్, అరాఫత్ మిన్హాస్, ఫఖర్ జమాన్, ఫహీమ్ అష్రఫ్, హరీస్ రవూఫ్, షాహీన్ షా అఫ్రిది

కాంట్రాక్ట్ (టీ20)
హసన్ నవాజ్, మాజ్ సదాకత్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, షాదాబ్ ఖాన్ మరియు ఉస్మాన్ తారిఖ్

డెవలప్‌మెంట్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆటగాళ్లు వీరే
అబ్దుల్ సమద్, అబ్దుల్లా ఫజల్, అహ్మద్ డానియాల్, అలీ రజా, ఫర్హాన్ యూసఫ్, హునైన్ షా, మహ్మద్ తాహా, మహ్మద్ తయ్యబ్ ఆరిఫ్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ, ముహమ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లా, సాద్ బేగ్, సాద్ మసూద్, సమీర్ మిన్హాస్, మోహైబ్ ఖనిన్, సఖీబ్ ఖానీన్, షాహైల్ ఖాన్ ఉబైద్ షా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement