చ‌రిత్ర సృష్టించిన షాహీన్ షా అఫ్రిది | Shaheen Afridi Joins Mohammed Shami, Rashid Khan In Elite ODI Bowling List | Sakshi
Sakshi News home page

PAK vs ENG: చ‌రిత్ర సృష్టించిన షాహీన్ షా అఫ్రిది

Oct 25 2026 3:18 PM | Updated on Oct 25 2026 3:48 PM

Shaheen Afridi Joins Mohammed Shami, Rashid Khan In Elite ODI Bowling List

పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. వ‌న్డే క్రికెట్‌లో అత్యంత‌వేగంగా 150 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి పాకిస్తాన్ ఫాస్ట్ బౌల‌ర్‌గా షాహీన్ నిలిచాడు. ముక్కోణ‌పు సిరీస్‌లో భాగంగా ల‌హోర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో అఫ్రిది ఈ రికార్డు సాధించాడు. 

అత‌డు కేవ‌లం 80 మ్యాచ్‌ల‌లోనే ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు దిగ్గ‌జ పేస‌ర్లు వ‌కార్ యూనిస్‌, షోయ‌బ్ అక్త‌ర్(91 మ్యాచ్‌లు)ల పేరిట‌ సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్‌తో వారిద్ద‌రిని అఫ్రిది అధిగ‌మించాడు. ఓవరాల్‌గా పాకిస్తాన్ త‌ర‌పున ఈ ఘ‌న‌త సాధించిన రెండో బౌల‌ర్‌గా షాహీన్ నిలిచాడు.

ఈ జాబితాలో అత‌డి కంటే ముందు లెజెండరీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ (78 మ్యాచ్‌లు) ఉన్నాడు. ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో మ‌హ్మ‌ద్ ష‌మీ, ర‌షీద్ ఖాన్‌ల‌తో క‌లిసి నాలుగో స్ధానంలో అఫ్రిది నిలిచాడు.

అత్యంత వేగంగా 150 వన్డే వికెట్లు తీసిన బౌలర్లు (మ్యాచ్‌ల పరంగా)
సందీప్ లామిచానే (నేపాల్) – 73 మ్యాచ్‌లు

మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 77 మ్యాచ్‌లు

సక్లైన్ ముస్తాక్ (పాకిస్తాన్) – 78 మ్యాచ్‌లు

మహ్మద్ షమీ (భారత్), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్), షాహీన్ షా అఫ్రిది (పాకిస్తాన్)* – 80 మ్యాచ్‌లు

ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) – 81 మ్యాచ్‌లు

పాక్ త‌ర‌పున ఈ ఫీట్ సాధించిన బౌల‌ర్లు వీరే
సక్లైన్ ముస్తాక్    78
షాహీన్ షా అఫ్రిది    80
వకార్ యూనిస్    91
షోయబ్ అక్తర్    91
సయీద్ అజ్మల్    93
చదవండి: SL vs PAK: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. ముగ్గురు 'మొనగాళ్ల'కు పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement