Photo Credit: ICC
పాకిస్తాన్ క్రికెటర్ హ్యారిస్ రవూఫ్‌నకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ స్పీడ్‌స్టర్‌కు గట్టి షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు.. అతడి ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ జత చేసింది.
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా హ్యారిస్ రవూఫ్.. ఓవరాక్షన్ చేసి ఈ మేరకు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. లాహోర్ వేదికగా ఆదివారం ఇంగ్లండ్- పాక్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది.
241 పరుగులు
గడాఫీ స్టేడియంలో టాస్ గెలిచి పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు దిగింది. 46.7 ఓవర్లలో 241 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాక్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. ఎనిమిదో స్థానంలో వచ్చిన షాదాబ్ ఖాన్ అద్భుత రీతిలో రాణించాడు.
113 పరుగులతో అజేయంగా నిలిచి
కేవలం 96 బంతుల్లో 13 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 113 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును.. వికెట్ తేడాతో గెలిపించాడు. షాదాబ్ సెంచరీ కారణంగా పాక్ 47.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్ 46వ ఓవర్లో సామ్ కర్రాన్ షాదాబ్‌కు బౌన్సర్‌గా సంధించగా.. అది అతడి తలపై నుంచి వెళ్లింది.
వైడ్ ఇవ్వాలంటూ వాగ్వాదం
ఈ క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న హ్యారిస్ రవూఫ్.. వైడ్ ఇవ్వాలంటూ అంపైర్‌ను ఒత్తిడి చేశాడు. కానీ అంపైర్ మాత్రం అందుకు అంగీకరించలేదు. అప్పటికే అక్కడ ఉన్న విల్ జాక్స్ కూడా నాట్ వైడ్ అన్నట్లుగా మాట్లాడాడు. దీంతో కోపోద్రిక్తుడైన రవూఫ్.. అంపైర్‌ను నెట్టుకుంటూ విల్ జాక్స్ మీదకు మీదకు వెళ్లాడు. బ్యాట్ చూపిస్తూ బెదిరించాడు.
శిక్షించిన ఐసీసీ
ఇంతలో జో రూట్ వచ్చి అతడిని సముదాయించాడు. అయినా సరే రవూఫ్ దూకుడుగానే ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ రవూఫ్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలో ఆర్టికల్ 1.1 నిబంధనను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది.
అదే విధంగా.. ఆర్టికల్ 2.2 నిబంధనలోని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తదితరులతో దురుసుగా ప్రవర్తించినందుకు ఓ డీ మెరిట్ పాయింట్ కూడా జతచేసింది. కాగా గత 24 నెలల్లో రవూఫ్ ఇలాంటి తప్పిదాలకు పాల్పడటం ఇది మూడోసారి.మరోసారి ఇలాగే చేస్తే అతడిపై కనీసం రెండు మ్యాచ్‌ల నిషేధం పడే అవకాశం ఉంది.
ఇంగ్లండ్ ఆటగాళ్లకూ జరిమానా
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిందుకు గానూ ఇంగ్లండ్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. ఆటగాళ్ల ఫీజులో 15 శాతం కోత వేసింది.
ఇదీ చదవండి: అతడి కోసం త్యాగం చేశాడు.. సంజూ భయ్యా గొప్పోడు: అభిషేక్
Sam Curran bowls a BOUNCER! Shadab Khan wants a WIDE as Umpire says NO! @TheRealPCB Haris Rauf has a verbal FIGHT with @englandcricket Will Jacks as Joe Root is the peacemaker😂 Drama in #PakistanCricket #PAKvENG https://t.co/lajM8FGfdf
— Chacha Abdul Shakoor (@ChachaAbdulSh10) October 25, 2026


