చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌.. తొలి ప్లేయర్‌గా రికార్డు! | Ben Duckett Becomes 1st English Batter To Score 2 ODI Centuries In Pakistan | Sakshi
Sakshi News home page

ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌.. తొలి ప్లేయర్‌గా రికార్డు!

Oct 26 2026 2:44 PM | Updated on Oct 26 2026 2:50 PM

Ben Duckett Becomes 1st English Batter To Score 2 ODI Centuries In Pakistan

PC: England cricket

వ‌న్డే మ‌క్కోణ‌పు సిరీస్‌లో భాగంగా ఆదివారం ల‌హోర్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఒక్క వికెట్ తేడాతో ఓట‌మి పాలైంది. 242 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కాపాడుకునేందుకు ఇంగ్లండ్ బౌల‌ర్లు ఆఖ‌రి వ‌ర‌కు పోరాడిన‌ప్ప‌టికి.. పాక్ ఆల్‌రౌండ‌ర్ షాదాబ్ ఖాన్ అద్భుత సెంచ‌రీతో ప‌ర్యాట‌క జ‌ట్టు నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌టికి ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ బెన్ డ‌కెట్ మాత్రం వీరోచిత శ‌త‌కంతో చెల‌రేగాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను పాక్ పేస‌ర్లు ఆరంభంలోనే భారీ షాకిచ్చారు. దీంతో ఇంగ్లీష్ జ‌ట్టు కేవ‌లం 52 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ స‌మ‌యంలో బాధ్యతాయుతంగా ఆడిన బెన్ డకెట్ త‌న అద్భుత సెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్నాడు. డ‌కెట్ కేవ‌లం 111 బంతుల్లో 105 పరుగులు (10 ఫోర్లు, 2 సిక్సర్లు, స్ట్రైక్ రేట్: 94.59) ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

తొలి ఇంగ్లండ్ బ్యాట‌ర్‌గా
ఈ క్ర‌మంలో డ‌కెట్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. పాకిస్థాన్ గడ్డపై రెండు వన్డే సెంచరీలు సాధించిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా డకెట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.  డకెట్ తన తొలి వన్డే సెంచరీని 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాపై ఇదే గడాఫీ స్టేడియంలో సాధించాడు. మ‌ళ్లీ ఇప్పుడు మ‌రోసారి పాక్ గ‌డ్డపై డకెట్ శ‌త‌క్కొట్టాడు.

లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో అత్యధిక వ‌న్డే సెంచరీలు సాధించిన ఓవర్సీస్ బ్యాటర్లు
2 - బెన్ డకెట్ (ఇంగ్లండ్)*
2 - కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)
2 - అరవింద డి సిల్వా (శ్రీలంక)
చదవండి: ENG vs PAK: పాక్ ప్లేయ‌ర్ వీరంగం.. గ్రౌండ్‌లోనే బ్యాట్ చూపిస్తూ పైపైకి! వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement