అభిషేక్‌ శర్మకు మరో జాక్‌పాట్‌ | Abhishek Sharma Dethrones Ishan Kishan To Reclaim No 1 Spot In ICC T20I Rankings | Sakshi
Sakshi News home page

అభిషేక్‌ శర్మకు మరో జాక్‌పాట్‌

Oct 28 2026 3:48 PM | Updated on Oct 28 2026 3:52 PM

Abhishek Sharma Dethrones Ishan Kishan To Reclaim No 1 Spot In ICC T20I Rankings

source: X

టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మకు మరో జాక్‌పాట్‌ తగిలింది. నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో సుడిగాలి శతకం బాది అందరి మన్ననలు పొందిన అతడు.. ఇవాళ విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని పొందాడు. ఈ క్రమంలో తన టీమిండియా సహచరుడు ఇషాన్‌ కిషన్‌ను మూడో స్థానానికి నెట్టాడు.

పాక్‌ కెప్టెన్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ మూడు నుంచి రెండో స్థానానికి ఎగబాకగా.. బ్రూక్‌, బట్లర్‌, బ్రెవిస్‌, సాల్ట్‌, హోప్‌ తలో స్థానం మెరుగుపర్చుకుని వరుసగా  4 నుంచి 8 స్థానాల్లో నిలిచాడు. టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఐదు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానానికి పడిపోగా.. వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ పదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

మిగతా భారత ఆటగాళ్లలో సంజూ శాంసన్‌ ఆరు స్థానాలు మెరుగుపర్చుకుని 25వ స్థానానికి చేరగా.. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ 9 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంక్‌కు చేరాడు. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో బెవాన్‌ జాకబ్స్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, డారిల్‌ మిచెల్‌ గణనీయంగా లబ్ది పొందారు. జాకబ్స్‌ 53, ఫిలిప్స్‌ 20, మిచెల్‌ 20 స్థానాలు ఎగబాకి  85, 37, 58 స్థానాలకు చేరారు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రషీద్‌ ఖాన్‌, ఆడ​మ్‌ జంపా, ఆదిల్‌ రషీద్‌ టాప్‌-3లో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ సాంట్నర్‌ 7 స్థానాలు మెరుగుపర్చుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. భారత్‌ నుంచి టాప్‌-10లో ఒక్క బౌలర్‌ కూడా లేడు. గత వారం 10వ స్థానంలో ఉండిన అక్షర్‌ పటేల్‌ ఓ స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌ మాత్రం 6 స్థానాలు మెరుగుపర్చుకొని 15వ స్థానానికి చేరాడు. 

ఇదీ చదవండి: జడేజా పీఠాన్ని కదిలించిన యాన్సెన్‌.. నాలుగేళ్ల ఆధిపత్యానికి తెర


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement