గేల్ రికార్డు బద్దలుకొట్టిన అభిషేక్‌ శర్మ | Abhishek Sharma Smashes 35 Ball Century Against New Zealand In 3rd T20I, Breaks Chris Gayle T20I Record With 11 Sixes, Watch Video | Sakshi
Sakshi News home page

గేల్ రికార్డు బద్దలుకొట్టిన అభిషేక్‌ శర్మ

Oct 28 2026 7:46 AM | Updated on Oct 28 2026 10:01 AM

 Abhishek Sharma-Breaks Gayle-Record-After-Smashes 11 Sixes-Vs NZ 3rd T20I

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో 35 బంతుల్లోనే సెంచరీ బాదిన అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. 38 బంతుల్లోనే 113 పరుగులు చేసిన అభిషేక్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 11 సిక్సర్లు ఉండడం విశేషం. ఇక సిక్సర్ల విషయంలో అభిషేక్ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ మాజీ విధ్వంకసర ఓపెనర్ క్రిస్ గేల్ రికార్డును కూడా అభిషేక్ బద్దలుకొట్టాడు. 

కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 సిక్సర్లు బాదిన అభిషేక్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ముచ్చటగా మూడోసారి ఒక ఇన్నింగ్స్‌లో పది లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. గతంలో గేల్ ఈ ఫీట్‌ను రెండుసార్లు సాధించగా, తాజాగా అభిషేక్ మూడోసారి 10 కంటే ఎక్కువ సిక్సర్లు బాది గేల్ రికార్డును అధిగమించాడు. ఇక ఆస్ట్రియా క్రికెటర్ కరన్‌బీర్ సింగ్ ఏకంగా ఐదుసార్లు ఒక ఇన్నింగ్స్‌లో పది లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు
👉కరన్‌బీర్ సింగ్ (ఆస్ట్రియా)- ఐదుసార్లు
👉అభిషేక్ శర్మ (టీమిండియా)- మూడుసార్లు
👉క్రిస్ గేల్ (వెస్టిండీస్‌)- రెండుసార్లు
👉ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)- రెండుసార్లు
👉అడ్రియన్ డన్‌బార్ (సెర్బియా)- రెండుసార్లు
👉కెండెల్ కడోవాకి ఫ్లెమింగ్ (జపాన్‌)- రెండుసార్లు

మ్యాచ్ విష‌యానికొస్తే.. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. మిచెల్‌ (52 బంతుల్లో 89 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... ఫిన్‌ అలెన్‌ (25 బంతుల్లో 40; 5 సిక్స్‌లు), బెవాన్‌ జాకబ్స్‌ (23 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

అనంతరం భారత్‌ 13.2 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అభిషేక్‌ శర్మ (38 బంతుల్లో 113; 9 ఫోర్లు, 11 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో సత్తా చాటగా... వైభవ్‌ సూర్యవంశీ (19 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా చెలరేగాడు. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 శుక్రవారం ఆక్లాండ్‌ వేదికగా జరగనుంది. 

 

ఇదీ చ‌ద‌వండి: 'ఆయ‌న ఎలా ఆడారో తెలియ‌దు; అద్భుతం ఒక్క‌సారే జ‌రుగుతుంది'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement