క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఏదో సందర్భంలో ఈ పేరు వినిపిస్తునే ఉంటుంది. ముఖ్యంగా ఆమె ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తల కోసం అయితే చెప్పనవసరం లేదు. తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి.
ఇప్పటి వరకు ఇండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌తో సారా డేటింగ్‌లో ఉందని.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు సారా పెళ్లిపై మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వచ్చే ఏడాదిలో పెళ్లి..
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ చిన్న కుమారుడు, యువ నటుడు రాజ్‌వీర్ డియోల్‌తో ఆమె వివాహం జరగబోతోందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు ఓ పార్టీలో కలుసుకున్నారని.. ఆ పరిచయం తర్వాతే ఇరు కుటుంబాల మధ్య పెళ్లి ప్రస్తావన వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా సారా.. 32 ఏళ్ల రాజ్‌వీర్ వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుంటారని టాక్.
అయితే ఈ పెళ్లి వార్తలపై అటు సచిన్ కుటుంబం కానీ.. ఇటు సన్నీ డియోల్ కుటుంబం కానీ ఇప్పటివరకు స్పందించలేదు. రాజ్‌వీర్ విషయానికి వస్తే.. డోన్ సినిమాతో 2023లో బాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు.
(ఇదీ చదవండి: అందుకే ఆమెకు ఫోన్ చేసి సారీ చెప్పా: సల్మాన్ ఖాన్)


