‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వైవా హర్ష (హర్ష చెముడు) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త వినోదాత్మక తెలుగు వెబ్ సిరీస్.
వైవా హర్షతో పాటు హైపర్ ఆది, జీవన్ కుమార్, ఐశ్వర్య హోలక్కల్, శ్రావ్య చౌదరి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ సినిమాకు బాబు దేగాల దర్శకత్వం వహించగా, వాయోన ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చవాన్, శ్రీధర్ చేని, దీపక్ ముస్త్యాల సంయుక్తంగా నిర్మించారు.


