హైదరాబాద్ లో నవరాత్రి సందడి మొదలుకానుంది.
హైదరాబాద్ మోడల్స్ , రాఘవి మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10వ సీజన్ సెలబ్రిటీ దాండియా నైట్స్ 2026, అక్టోబర్ 9 నుంచి 20వ తేదీ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఐఎస్‌బీ రోడ్ లో గల ఫ్లిప్‌సైడ్ అడ్వెంచర్ పార్క్ వేదికగా జరగనుంది.
12 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో సంప్రదాయ దాండియా, సంగీతం, నృత్యం, వినోదం, సెలబ్రిటీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
కుటుంబాలు, యువత, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, ఫ్యాషన్ మోడల్స్‌తో పాటు వినోద రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.


